హైదరాబాద్‌లో 'కామిక్ కాన్' ఈవెంట్.. ఎ‍ప్పటి నుంచో తెలుసా? | Comic Con 2024 Event In Hyderabad Hitex Exhibition Centre, Dates And Other Details Inside - Sakshi
Sakshi News home page

Hyderabad Comic Con 2024: హైదరాబాద్‌లో 'కామిక్ కాన్' ఈవెంట్.. ఎ‍ప్పటి నుంచో తెలుసా?

Jan 19 2024 8:43 PM | Updated on Jan 20 2024 9:05 AM

Comic Con 2024 Event In Hyderabad Full Details  - Sakshi

గేమింగ్, సినీ ప్రేమికుల కోసం 'కామిక్ కాన్' ఈవెంట్ సిద్ధమైపోయింది. హైదరాబాద్‌లో వచ్చే వారాంతం అంటే జనవరి 27, 28వ తేదీల్లో ఈ వేడుక జరగనుంది. ఇందులో భాగంగా యానిమే, గేమింగ్, పాప్-కల్చర్ ప్రియులకు మునుపెన్నడూ లేని అనుభూతిని ఇది అందివ్వబోతుంది. ఈ వేడుకకు హాజరైన ప్రతిఒక్కరూ పరిమిత ఎడిషన్ డీసీ కామిక్స్ బ‍్యాట్‌మాన్ పోస్టర్‌తో పాటు స్మారక కామిక్ కాన్ ఇండియా బ్యాగ్‌, మార్వెల్ ఇన్ఫినిటీ గాంట్లెట్ నం.1 కామిక్ పుస్తకం యొక్క ప్రత్యేక కాపీని అందుకుంటారు. 

(ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ)

కామిక్ కాన్ ఇండియా వ్యవస్థాపకుడు జతిన్ వర్మ మాట్లాడుతూ.. 'కామిక్ కాన్ ఎట్టకేలకు మూడు సంవత్సరాల విరామం తర్వాత హైదరాబాద్‌కు తిరిగి  రాబోతుంది. అభిమానులందరికీ మళ్లీ హోస్ట్ చేయడానికి మేము ఎదురుచూస్తున్నాం. ఇది ఇప్పటికీ నగరంలో మా అతిపెద్ద ప్రదర్శన, అత్యుత్తమ భారతీయ కామిక్స్, అభిమానుల అనుభవాలు, కాస్ ప్లే, గేమింగ్, గీకీ షాపింగ్‌తోపాటు మరిన్నింటిని ప్రదర్శించబోతున్నాం' అని చెప్పుకొచ్చారు. వీకెండ్‌లో రెండు రోజుల పాటు జరిగే ఈవెంట్ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. 

(ఇదీ చదవండి: అయోధ్య కోసం ప్రభాస్ రూ.50 కోట్ల విరాళం.. క్లారిటీ ఇచ్చిన టీమ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement