Jabardasth Kiraak RP Engagement Photos: కిరాక్‌ ఆర్పీ నిశ్చితార్థం, ఫొటోలు వైరల్‌

Comedian Kiraak RP Engagement Photos Goes Viral - Sakshi

కామెడీ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు కిరాక్‌ ఆర్పీ. టైమింగ్‌ మిస్‌ కాకుండా పంచ్‌లు వేస్తూ స్కిట్లు వదులుతుంటాడు. ప్రజలను పొట్టచెక్కలయ్యేలా నవ్వించే కమెడియన్‌ కిరాక్‌ ఆర్పీ తాజాగా పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యాడు. తన ప్రేయసి లక్ష్మీ ప్రసన్నతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో గ్రాండ్‌గా ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.

ఈ నిశ్చితార్థానికి నటుడు ధనరాజ్‌ కుటుంబ సమేతంగా హాజరై వారిని ఆశీర్వదించాడు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేస్తూ మరోసారి శుభాకాంక్షలు చెప్పాడు. ఆర్పీ ఎంగేజ్‌మెంట్‌కు ధనరాజ్‌తో పాటు పలువురు కమెడియన్లు, బుల్లితెర సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.  ప్రస్తుతం దీనికి  సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా ఆర్‌పీ ఇటీవలే యూట్యూబ్‌ చానల్‌ మొదలు పెట్టాడు. ఇందులో మొట్టమొదటగా హోమ్‌ టూర్‌ వీడియో చేశాడు. అందులో లిఫ్ట్‌, హోం థియేటర్‌.. ఇలా అన్నింటినీ చూపించిన ఆర్పీ తన బెడ్‌రూమ్‌లోని ఓ అమ్మాయి ఫొటో చూపించి ఆమె తనకు కాబోయే భార్య అని జనాలకు పరిచయం చేశాడు.

చదవండి: ఈ సినిమాతో నా కల నెరవేరింది.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీచరణ్‌
దుల్కర్‌ సల్మాన్‌ 'సీతారామం' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top