
లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపిస్తారు. ‘సీతారామం’ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 5న థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా బుధవారం చిత్రయూనిట్ ప్రకటించింది.
దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీతారామం’. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపిస్తారు.
‘సీతారామం’ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 5న థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా బుధవారం చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘చరిత్రలోని పేజీల్లో దాగి ఉన్న ప్రేమలేఖ ‘సీతారామం’గా థియేటర్స్‌లోకి వస్తుంది’’ అని ట్వీట్ చేశారు దుల్కర్. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్.
A love letter from the pages of history delivering soon to theatres near you…#SitaRamam Worldwide Release On 𝐀𝐮𝐠 𝟓𝐭𝐡, 𝟐𝟎𝟐𝟐 ♥️@mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @VyjayanthiFilms @SwapnaCinema @Composer_Vishal @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/CUfh6K9rlN
— Dulquer Salmaan (@dulQuer) May 25, 2022
చదవండి: ‘నన్ను నేను సరిచేసుకుంటున్నా..’ అంటున్న చై
సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్టార్ హీరో కూతురు సందడి, ఫొటోలు వైరల్