Comedian Ali: ఇంటి బిర్యానీ రుచి చూపించిన అలీ

వెంకటేష్, వరుణ్‌తేజ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 2. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌ను నమోదు చేసుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి దీనికి సీక్వెల్‌ను ప్లాన్ చేశాడు. మళ్లీ ఇదే ఇద్దరు హీరోలను పెట్టి ఎఫ్ 3 సినిమా తీస్తున్నాడు. ఇందులో మెహరీన్, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కమెడియన్ అలీ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
తాజాగా అతడు ఎఫ్ 3 మూవీ టీమ్‌కు మాంచి విందు భోజనం ఏర్పాటు చేశాడు. సెట్‌లో ఉన్నవారందరికీ మటన్ బిర్యానీ తినిపించాడు. అది కూడా ఇంట్లో సిద్ధం చేసిన బిర్యానీ! ఇంకేముందీ.. ఆ బిర్యానీని చూడగానే లొట్టలేసుకుని తిన్నారు చిత్రయూనిట్ సభ్యులు. బిర్యానీ ఎంతో రుచికరంగా ఉందంటూ అనిల్ రావిపూడి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్ చేశాడు. 'అలీ గారు ఇంట్లో వండించి తీసుకొచ్చి మాకు వడ్డించారు' అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ బిర్యానీ టేస్ట్‌ను హీరోహీరోయిన్లు మిస్ అయినట్లు తెలుస్తోంది.