రావణ చరిత్ర కోసం చిరంజీవిని కలుస్తాం: భరద్వాజ | Code Ramayana First Look Poster Released Ravanasura As Chiranjeevi | Sakshi
Sakshi News home page

జై శ్రీ రావణ్ నినాదంతో 'కోడ్ రామాయణ'

Jun 11 2023 7:52 PM | Updated on Jun 11 2023 7:56 PM

Code Ramayana First Look Poster Released Ravanasura As Chiranjeevi - Sakshi

సౌద అరుణ స్టూడియోస్ పతాకంపై డ్రవిడ భూమి యొక్క ఆత్మ గౌరవ నినాదంతో  'కోడ్ రామాయణ' రానుంది.  పాపులర్ రైటర్ సౌద అరుణ దర్శకత్వంలో  నిర్మించనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బౌద్ధ బిక్షువు బంతె షీల్ రక్షిత్,  ప్రముఖ రచయిత్రి లలిత చేతుల మీదుగా పోస్టర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

(ఇదీ చదవండి: కాజల్‌ అగర్వాల్‌ చివరి సినిమా ఇదేనా?)

దూర్వాసుడు పాత్రలో నటించిన భరద్వాజ మాట్లాడుతూ..  కోడ్ రామాయణ ద్వారా దాని అంతరార్థం మాత్రం తెలుస్తుందన్నారు. దీని తరువాత వచ్చే రెండవ భాగం 'రావణచరిత్ర' మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుంది. దాంట్లో రావణ పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఆ తరువాత  మూడవ భాగం 'ఉత్తర రామాయణం' ఉంటుంది. ఇలా మూడు భాగాలుగా చెపుతూ.. డ్రవిడ భూమి ఆత్మ గౌరవం గురించి ఈ సినిమాలు తెలుపుతాయి. డ్రవిడ భూమి ఏ కారణాల చేత గుర్తింపు లేకుండా పోయిందో తెలపడమే  ఈ సినిమా ముఖ్య ఉద్దేశమని భరద్వాజ అన్నారు.

ప్రముఖ దర్శకుడు సౌద రచించిన  ఈ పౌరాణిక అధ్యయనాన్ని ఇప్పుడు దృశ్య రూపకంగా తెరపైకి తీసుకువచ్చే  ప్రయత్నం  చేస్తున్నామన్నారు. ఈ సినిమా రిలీజ్ కాగానే మెగాస్టార్ చిరంజీవికి  చూపించి... రెండోవ భాగంలో వచ్చే 'రావణచరిత్ర'లోని  రావణాసుర పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తామని భరద్వాజ తెలిపారు.

(ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్‌ చేసుకున్న హీరోయిన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement