Box Office Collections Clash Between Chiranjeevi Godfather And Vikram Cobra Movie - Sakshi
Sakshi News home page

Godfather Vs Cobra: చిరంజీవితో బాక్సాఫీస్‌ వార్‌కి సై అంటున్న తమిళ స్టార్‌!

May 22 2022 1:04 PM | Updated on May 22 2022 1:23 PM

Chiranjeevi Vs Vikram Clash At The Box Office - Sakshi

చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య ఏ రేంజ్ లో మెగా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిందో తెలిసిందే. అందుకే ఇక ఆలస్యం చేయకుండా వారిని ఎంటర్ టైన్ చేసేందుకు గాడ్ ఫాదర్ మూవీతో తిరిగి రావాలని చిరు కోరుకుంటున్నాడు. ఆగస్ట్ 15.. హాలీడే వీకెండ్ను టార్గెట్గా చేసుకుంటూ తన కొత్త సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నాడు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అయితే ఆగస్ట్‌ రెండో వారంలో గాడ్‌ఫాదర్‌ రిలీజ్‌ ఉంటుందని కేవలం ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే చెప్పుకొస్తున్నాయి. అంతేకానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇదిలా ఉంటే.. ఆగస్ట్‌ సెకండ్‌ వీక్‌పై ఖర్చీఫ్‌ వేశాడు తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌. ఆయన హీరోగా తెరకెక్కిన ‘కోబ్రా’ చిత్రం ఆగస్ట్‌ 11న సౌత్‌ మొత్తం భారీ స్థాయిలో రిలీజ్‌ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద చిరు, విక్రమ్‌ల మధ్య యుద్దం తప్పనిసరి అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ఆగస్ట్‌ రెండో వారంలో కేవలం చిరు, విక్రమ్‌లు మాత్రమే పోటీ పడడం లేదు.. బోనస్‌గా అఖిల్‌, సమంత కూడా వచ్చేస్తున్నారు. అఖిల్‌ ఏజెంట్‌, సామ్‌ ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీ యశోద కూడా అదే వారంలో విడుదల కాబోతున్నాయి. యూత్‌స్టార్‌ నితిన్‌ నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’కూడా బరిలో నిలవబోతున్నాయి. మరి ఈ బాక్సాఫీస్‌ వార్‌లో గెలిదేవరో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement