Chiranjeevi Not Taking Remuneration For Bhola Shankar Movie, But There Is One Twist - Sakshi
Sakshi News home page

Chiranjeevi Bhola Shankar Remuneration: భోళా శంకర్‌ కోసం పారితోషికమే తీసుకోని మెగాస్టార్‌..

Jul 28 2023 3:40 PM | Updated on Jul 28 2023 3:56 PM

Chiranjeevi Not Taking Remuneration For Bhola Shankar Movie, There is a Twist - Sakshi

అయితే ఈ సినిమాకు మెగాస్టార్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట! మంచి పారితోషికం ముట్టజెప్తామన్నా సరే తీసుకోవడానికి నిరాకరించాడట. అందుకు కారణం లేకపోలేదు

ఆచార్యతో ఫ్లాప్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఇదే హిట్‌ను కొనసాగించాలన్న జోష్‌లో ఉన్నాడు చిరు. అందుకే ఈసారి కోలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ వేదాళం చిత్రాన్ని ఎంచుకున్నాడు. ప్రస్తుతం అతడు వేదాళం రీమేక్‌ భోళా శంకర్‌ సినిమా చేస్తున్నాడు. ఇందులో మెగాస్టార్‌తో తమన్నా జోడీ కట్టగా ఆయన చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటించింది. సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, ‘వెన్నెల’ కిషోర్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

మెహర్‌ రమేశ్‌ దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాను అనిల్‌ సుంకర సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించాడు. తాజాగా రిలీజైన ట్రైలర్‌కు వస్తున్న స్పందన కూడా అదిరిపోయింది. రోజురోజుకూ చిరంజీవిలో ఎనర్జీ పెరిగిపోతోందన్న కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు మెగాస్టార్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట! మంచి పారితోషికం ముట్టజెప్తామన్నా సరే తీసుకోవడానికి నిరాకరించాడట. అందుకు కారణం లేకపోలేదు.

భోళా శంకర్‌ సినిమాపై బోలెడంత నమ్మకం పెట్టుకున్న చిరు అందులో వాటా కావాలని కోరాడట! ఇప్పటికే సినిమా థియేట్రికల్‌, ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. కాబట్టి సినిమా రిలీజయ్యాక వచ్చే లాభాల్లో చిరంజీవి అడిగినంత మొత్తాన్ని ఇచ్చేందుకు మేకర్స్‌ అంగీకరించారంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

చదవండి: బ్రో మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement