Mega Star Chiranjeevi and Director Koratala Siva Full Interview About Acharya Movie - Sakshi
Sakshi News home page

Chiranjeevi : 'షూటింగ్‌ స్పాట్‌కి సురేఖ వస్తానంటే చరణ్‌ రానివ్వలేదు'

Apr 25 2022 4:38 PM | Updated on Apr 25 2022 6:42 PM

Chiranjeevi Koratala Siva Interview About Acharya - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ నటించిన చిత్రం​ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న చిరంజీవి, కొరటాల పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చరణ్‌తో కలిసి సినిమా చేయడంపై చిరంజీవి మాట్లాడుతూ..'ఈ సినిమా ద్వారా చరణ్‌, నేను స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా సంతోషకరం.

ఆచార్య షూటింగ్‌ కోసం మారేడుమిల్లిలో 12 రోజుల పాటు ఉన్నాం. ఆ సమయంలో ఇద్దరం ఒకే రూం, జిమ్‌ షేర్‌ చేసుకున్నాం. ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నా షూటింగ్‌లో కోస్టార్స్‌గా ఒకే చోట టైం టైం స్పెండ్‌ చేయడం అన్నది బ్యూటిఫుల్‌ మూమెంట్‌. అప్పుడు షూటింగ్‌ చూసేందుకు వస్తానని సురేఖ చెప్పినా చరణ్‌ ఒప్పుకోలేదు. డాడీతో నేను ఉంటాను అని రావొద్దన్నాడు.

కొడుకుగా చరణ్‌ ఎంత సంతోషడ్డాడో నేను కూడా అంతే సంతోషించా. తండ్రీ, కొడుకులుగా మా ఇద్దరికీ ఇది ఒక తీపి ఙ్ఞాపకంలా మిగిలిపోతుంది' అని పేర్కొన్నారు. ఆచార్య గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్‌ విశేషాలు తెలియాలంటూ పూర్తి వీడియో చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement