Chiranjeevi And Other Celebrities Condolence To Mahesh Babu's Mother Indira Devi Death - Sakshi
Sakshi News home page

Mahesh Babu-Chiranjeevi: మహేశ్‌ బాబు తల్లి మృతి.. చిరంజీవి సంతాపం

Sep 28 2022 8:38 AM | Updated on Sep 28 2022 11:19 AM

Chiranjeevi Condolence To Mahesh Babu And Family Over His Mother Death - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ ఇంట త్రీవ విషాదం నెలకొంది. ఆయన తల్లి, సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరా దేవి బుధవారం ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఇందిరా దేవి మరణం మహేశ్‌ బాబు, ఇతర కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. దీంతో టాలీవుడ్‌ సినీ ప్రముఖులు, హీరోలు, నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. మహేశ్‌ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

చదవండి: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం

అలాగే మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేస్తూ ఇందిరా దేవికి నివాళులు అర్పించారు. ‘శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు  మహేష్ బాబుకి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అని చిరు ట్వీట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement