breaking news
Indira Devi
-
నిదురించే తోటకు పాట వెళ్లి పోయింది
‘జీవితం ఒక ప్రయాణం చివరి మజిలీ మరణం’ అని రాసుకున్న ప్రఖ్యాత హిందీ, ఆంగ్ల కవయిత్రి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్ (96) మరణంతో తెలుగు సాహిత్యానికీ, రాచరిక అభిలాషకీ ఉన్న అనుబంధం ముగిసి పోయింది. ధన్‌రాజ్‌గిర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అయినా గుంటూరు శేషేంద్రశర్మ సహచరిగానే తెలియడం ఒక పరిమితి. పట్టుదల, కవితాభిలాష, సాహితీ జిజ్ఞాస మెండుగా ఉన్న ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్ తెలుగువారికి కొన్ని జ్ఞాపకాలను మిగిల్చారు. ఒక జ్ఞాపకంగా మిగిలారు.గాంధార దేశ రాకుమారి గురించి వినేవారం. కాని ఇందిరా ధన్‌రాజ్‌గిర్ రూపంలో చూడగలిగాం. అవును. ఇందిరాదేవి పూర్వీకులు నేటి అఫ్ఘానిస్తాన్ నుంచి పూణె మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. నిజాం తర్వాత అంతటి సంపన్నులుగా, దాతృత్వం కలవారుగా పేరు గడించిన రాజా జ్ఞాన్ గిరిరాజ్ బహదూర్, ప్రమీలా దేవిల పెద్ద కుమార్తె అయిన ఇందిరా దేవి చిన్నప్పటి నుంచి తన వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత అభిలాషలను, కళా సౌందర్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. గొప్ప గొప్ప కవులు, కళాకారులతో పరిచయం కలిగి కళాభిరుచిని పరిపుష్టం చేసుకున్నారు. ఏ రాకుమారుణ్ణో వలచాల్సిన ఈ రాకుమార్తె కవిని వలచడం, ఆ కవి తెలుగువాడు కావడం విశేషం. గుంటూరు శేషేంద్ర శర్మ సాహచర్యంలో ఇందిరా ధన్‌రాజ్‌గిర్ తన జీవితాన్ని కవితాత్మకం చేసుకున్నారు.→ ఎస్టేటే విద్యాలయంఇందిరా దేవి జీవితం చివరి వరకూ సాగిన తాత తండ్రుల ప్యాలెస్ ‘జ్ఞాన్‌బాగ్ ఎస్టేట్’ లేదా ‘ధన్‌రాజ్‌గిర్ బాగ్’ నాంపల్లి దాపున 8 ఎకరాల్లో 30 వేల చదరపు అడుగుల్లో 19 విశాల గదులతో ఉంటుంది. అక్కడే ఆమె బాల్యం, వైవాహిక జీవితం, విశ్రాంత జీవితం కొనసాగింది. ఒక దశలో ప్యాలెస్‌ను విడిచి బంజారా హిల్స్‌కు మారి పోవాలని భావించినా మనసు మార్చుకుని అక్కడే ఉండి పోయారు. లాక్డౌన్ సమయంలో పని వాళ్లందరూ వెళ్లి పోగా ఒకరిద్దరు సహాయకులతో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. అంతటి మమకారం ఆ ప్యాలెస్ అంటే ఆమెకు. ఇందిరాదేవి కొంతకాలం మెహబూబియా బాలికల పాఠశాలలో చదువుకున్నా ఈ జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్సే ఆమె విద్యాలయంగా మారింది. ఇంటి వద్ద ఆంగ్ల గవర్నెస్ ద్వారా చదువుకున్నారు. ఆ తర్వాత ప్రఖ్యాత కవి అల్లామా ఇక్బాల్ ప్రేరణతో తొమ్మిదో ఏటనే రచనలు చేయడం ప్రారంభించారు. ఆంగ్లం, హిందీ, ఉర్దూ, మరాఠా భాషలు ఆమెకు కొట్టిన పిండి. ఇంగ్లిష్‌లో గొప్ప పాండిత్యం ఉంది. ప్రఖ్యాత కవి, ప్రొగ్రెసివ్ రైటర్స్ మూవ్మెంట్ సభ్యుడు మఖ్దూం మొహియుద్దీన్‌తో ఉన్న స్నేహం ఆమె ప్రగతివాద దృష్టిని ఇచ్చిందని చెబుతారు.→ సొంతగా టైప్ నేర్చుకుని...ఇందిర తనకు తానుగా టైప్ చేయడం నేర్చుకోవడమే కాదు ఉర్దూలో ద్విపదలు కం పోజ్ చేయడం మొదలెట్టారు. ఫొటోలు తీయడం హాబీగా మొదలై తర్వాతి కాలంలో గొప్ప నైపుణ్యంగా మారింది. 1964లో తన మొదటి కవితా సంపుటి ‘ది అ పోస్టల్’, 1965లో ‘రిటర్న్ ఎటర్నిటీ’ వరుసగా వెలువరించడంతో కవులు ఆమెతో పరిచయ భాగ్యం కలిగి ఉండటం గౌరవంగా భావించారు. జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్‌లో గుంటూరు శేషేంద్ర శర్మ, మఖ్దూం మొహియుద్దీన్, జ్వాలాముఖి తదితరులు ఆమెతో కవిత్వంపై చర్చించడానికి, చదవడానికి కలిసేవారు. శేషేంద్ర శర్మతో పరిచయం వివాహానికి దారితీసింది. ఆయనకు అప్పటికే మొదటి వివాహం ద్వారా ముగ్గురు పిల్లలు ఉన్నా ఆమె పరిగణనలోకి తీసుకోలేదు.→ పూలు పూసే తోట‘నా మనసు పూలు పూసే తోట’ అని కవిత్వం రాయగలిగిన ఇందిరా దేవి వివాహం తర్వాత అంత ఎక్కువగా కవిత్వం రాయలేదు. ‘ఒక ఇంటిలో ఇద్దరు కవులు ఉండరాదు’ అని ఆమె అన్నట్టుగా చెబుతారు. అయితే ‘ఈ తోట’ను శేషేంద్ర కవిత్వం చేశారు. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అని బహుశా తన జీవితంలో ఆమె రాకను సూచిస్తూ కవిత రాస్తే దానిని బాపు, రమణలు ‘ముత్యాల ముగ్గు’ కోసం గొప్ప పాటగా తెలుగువారికి కానుక చేశారు. ‘ముత్యాల ముగ్గు’ కోసం ఇందిరా దేవి తన ప్యాలస్‌ను షూటింగ్‌కు అనుమతి ఇచ్చారు. ‘ముత్యాల ముగ్గు’లో అలా జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్ చిరస్థాయిగా నిలిచి పోయింది.→ చివరి కోరికఅంబర్ పేట్ శ్మశాన వాటికలో శేషేంద్ర సమాధి పక్కనే ఆమె అంత్యక్రియలు నిరాడంబరంగా జరిగి పోయాయి. అది ఆమె చివరి కోరిక. అట్టహాసం లేకుండా అంత్యక్రియలు జరిగి పోవాలనేది కూడా ఆమె ఆఖరి ఆలోచన. మొత్తానికి ఒక చరిత్ర ముగిసింది. కవిత్వంలో ఒక రాజకుమారి వీడ్కోలు తీసుకుంది.అనేక ఘనతలుఇందిరాదేవి ‘మెమోరీస్ ఆఫ్ ది డెక్కన్’ అనే కాఫీ టేబుల్ బుక్‌ను తయారు చేసి ఎనిమిదవ నిజాం యువరాజు ముకరం జాకు 2008లో అంకితమిచ్చారు. ఆమె రాసిన ఒక కాలం ఉర్దూ పత్రికలో 12 ఏళ్లు కొనసాగి 750 పేజీల పుస్తకంగా వచ్చింది. 1973 సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఆమె పేరును నామినేట్ చేయడాన్ని నేటికీ విశేషంగా చెప్పుకుంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆమె పేరుతో ఒక హాల్‌ను కళా సాహిత్యాలకు అంకితం చేసింది. -
నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి?
ఫ్యాషన్ ఐకాన్, అందమైన రాణి. సాటిలేని అందగత్తె మాత్రమే కాదు అపర మేధావి కూడా. ఆమె పేరే కూచ్ బెహార్ మహారాణి ఇందిరా దేవి. అందానికి మించిన తెలివితేటలు, అంతకుమించిన ఐశ్వర్యంతో తులతూగిన మహిళ. బరోడాలోని విలాసవంతమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో యువరాణిగా పెరిగింది. పాఠశాల, కళాశాలకు వెళ్ళిన తొలి యువరాణి కూడా ఇందిర కావడం విశేషం. పదండి ఇందిరా దేవి జీవిత విశేషాలు, విలాసవంతమైన జీవన శైలి గురించి తెలుసుకుందాం.బరోడా మహారాజు సాయాజిరావు గైక్వాడ్ III , అతని రెండవ భార్య చిమ్నాబాయి II ల కుమార్తె ఇందిర. చాలా చిన్న వయస్సు నుండే చాలా తెలివిగా, సామాజిక స్పృహతో ఉంటూ, అనేక సామాజిక సమస్యలపై గొంతెత్తిన మహిళ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులకు విలాసవంతమైన పార్టీలను ఇచ్చేదట. ఫ్యాషన్‌కు పెట్టింది పేరైన ఇందిర ఖరీదైన దుస్తులను ధరించేదట. అంతేకాదు ఒకసారి ఆమె వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన 100 జతల ఫెర్రాగామో బూట్లు ఆర్డర్ చేసిందట. ఆమె ధరించే సాండిల్స్ కూడా చాలా ఖరీదైనవే.మహారాణి ఇందిరాదేవి విలాసవంతమైన ప్రతిదాన్ని ఇష్టపడేవారట. చరిత్రకారుడు అంగ్మా డే ఝాలా రాసిన ఒక పుస్తకం, రాయల్ ప్యాట్రనేజ్, పవర్, అండ్ ఈస్తటిక్స్ ఇన్ ప్రిన్స్లీ ఇండియా అనే పుస్తకంలో ఇందిరా దేవికి సంబంధించిన అనేక విశేషాలను పొందుపర్చారు. మహారాణి ఇందిరా దేవికి పాదరక్షలంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆమె ధరించే బూట్ల బ్రాండ్ చాలా స్పెషల్ అనీ, నాణ్యమైన బూట్లకు ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ సాల్వటోర్ ఫెర్రాగామోను చాలా ఇష్టపడేదని రాసుకొచ్చారు.1938లో మహారాణి కెంపులు, వజ్రాలు, పచ్చలతో పొదిగిన కస్టమ్-మేడ్ సాల్వటోర్ ఫెర్రాగామో 100 జతల ఫెర్రాగామో బూట్లను ఆర్డర్ చేసింది. కప్పబడి ఉంది. ఇవి 20వ శతాబ్దపు ఇటలీలోని ఫ్లోరెన్స్‌లోని మ్యూజియో సాల్వటోర్ ఫెర్రాగామోలో ప్రదర్శించారని కూడా తెలిపారు.చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?అందమైన , షిపాన్ చీరలు షిఫాన్ చీరను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత ఆమెకు దక్కింది. పారిస్ నుండి 45-అంగుళాల వెడల్పులో నేసిన షిఫాన్ చీరలను ఆర్డర్ చేసేది. ఢిల్లీ , కలకత్తాలో ఆమె కొనుగోలు చీరలను కొనుగోలు చేసిన ఒక ఏడాది తరవాత మాత్రమే ఇతర కస్టమర్లకు అదే నమూనాను తయారు చేయడానికి అనుమతి ఉండేది అంటే ఆమె స్టేటస్‌ను అర్థం చేసుకోవచ్చు.ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ ప్రేమ వివాహం18 ఏళ్ళ వయసులో మహారాణి ఇందిరా దేవి గ్వాలియర్ మహారాజు మాధో రావు సింధియాతో నిశ్చితార్థం అయింది. 1911లో ఢిల్లీ పర్యటన సందర్భంగా మహారాజు తీరు, ముఖ్యంగా గ్వాలియర్ , బరోడా రాజ కుటుంబాల మధ్య సంబంధాలపై రాజకీయ పరిణామాలు కారణంగా ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. దీని వల్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసినా సాహసమైన నిర్ణయం తీసుకుంది. తరువాత ఆమె అప్పటి కూచ్ బెహార్ మహారాజు తమ్ముడు యువరాజు జితేంద్ర నారాయణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఊహించినట్టుగానే ప్లేబాయ్‌గా పేరు తెచ్చుకున్న జితేంద్రతో వివాహాన్ని దీన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. కానీ లండన్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో అతడిని పెళ్లాడింది.ఇదీ చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!సోదరుడు మహారాజా రాజేంద్ర నారాయణ్ మరణించిన తర్వాత, జితేంద్ర కూచ్ బెహార్ మహారాజు అయ్యాడు. ఈ జంట జీవితం సంతోషంగాగడిచింది.కానీ జితేంద్ర మితిమీరిన మద్యపానం అతని అకాల మరణానికి దారితీసింది.వివాహమైన పదేళ్లకు జితేంద్ర మరణించడంతో ఐదుగురు పిల్లలతో ఇందిర ఒంటరిదై పోయింది. రాణి ఇందిరా దేవి తన ఐదుగురు పిల్లలతో కూచ్ బెహార్ వ్యవహారాలను నిర్వహించింది. ఆ కాలంలోనే అన్ని ఆంక్షలను తోసిపుచ్చి ఇందిర స్వతంత్ర జీవితాన్ని గడిపింది. ఇంగ్లాండ్ , ఫ్రాన్స్‌లలో ఉంటూ హాలీవుడ్ తారలు, సన్నిహితులతో లగ్జరీ పార్టీలతో ఉత్సాహవంతమైన జీవితాన్ని గడిపింది. ఆమె స్వేచ్ఛా జీవితం, తెలివితేటలు, ఆమెకు బలమైన మహిళగా ఖ్యాతిని తెచ్చిపెట్టాయి."అత్యంత అందమైన , ఉత్తేజకరమైన మహిళ అమ్మ. ఆమె తెలివితేటలు ఆమె ప్రేమ, వెచ్చదనం , సున్నితమైన చూపుల అసమానమైన కలయికగా నా జ్ఞాపకంలో ఉంది." తన తల్లి గురించి ఇందిరా దేవి కుమార్తె మహారాణి గాయత్రీ దేవి మాటలివి. 1892లో జన్మించిన రాణి ఇందిరా దేవి 1968లో 76 సంవత్సరాల వయసులో మరణించారు. -
నిన్ను చాలా మిస్ అవుతున్నా.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్
హీరో మహేశ్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం ఒడిశాలో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. ఆ వెంటనే తన కుటుంబంతో కలిసి ఇటలీ ట్రిప్ వేశాడు. తాజాగా తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు. ఈ క్రమంలోనే తల్లి గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: దెయ్యం సినిమాకు వసూళ్లు ఎంతొచ్చాయ్?)మహేశ్ బాబుకు తల్లి ఇందిరా దేవి(Indira Devi) అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ 2022లో ఆమె చనిపోవడం మాత్రం మహేశ్ కి తీరనిలోటు అని చెప్పొచ్చు. తర్వాత సందర్భం వచ్చిన ప్రతిసారి ఆమెని గుర్తుచేసుకుంటూ ఉంటాడు. తాజాగా ఆదివారం (ఏప్రిల్ 20) ఆమె పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు లవ్లీ పోస్ట్ పెట్టాడు.మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నా అమ్మ.. హ్యాపీ బర్త్ డే అని అమ్మతో కలిసి ఉన్న ఓ ఫొటోని మహేశ్ బాబు పోస్ట్ చేశాడు. దీనికి అతడి అభిమానులు తెగ కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?)తల్లినే కాదు కుటుంబానికి మహేశ్ చాలా ప్రాధాన్యమిస్తాడు. అయితే షూటింగ్ లో ఉంటాడు. లేదంటే ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపుతూ కనిపిస్తుంటాడు. అందుకే ఏడాదిలో రెండు మూడు సార్లు కూతురు సితార(Sitara Ghattamaneni), కొడుకు గౌతమ్, భార్య నమ్రతతో కలిసి మహేశ్ ట్రిప్స్ కి వెళ్తూనే ఉంటాడు.ఇక రాజమౌళితో మహేశ్ బాబు చేస్తున్న సినిమా విషయానికొస్తే.. అడవుల బ్యాక్ డ్రాప్ లో జరిగే అడ్వెంచరస్ కథతో దీన్ని తీస్తున్నారు. మహేశ్ తోపాటు ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 31న గానీ లేదా అంతకుముందే మూవీ గురించి అనౌన్స్ మెంట్ ఉండొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
సూపర్‌స్టార్ కృష్ణ మృతి.. ఆయన అత్తగారి గ్రామంలో విషాదఛాయలు
ఖమ్మం గాంధీచౌక్ : తెలుగు సినిమా రంగంలో అనేక రికార్డులు నెలకొల్పిన సినీ హీరో, సూపర్‌స్టార్ కృష్ణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో విడదీయలేని బంధం ఉంది. ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం ముసలిమడుగుకు చెందిన ఇందిరాదేవిని కృష్ణ వివాహమాడారు. అత్తగారి ఇంటికి వచ్చివెళ్లే క్రమంలో ఆయనకు ఖమ్మంతో అనుబంధం ఏర్పడింది. ఇక వందలాది సినిమాల్లో హీరోగా నటించిన కృష్ణకు జిల్లాలో అభిమానులు కూడా ఎక్కువే. హీరోగా గురిపు సాధించిన ఆయన అభిమానులు ఏర్పాటుచేసిన కార్యక్రమాలతో పాటు రాజకీయ నాయకుడిగానూ జిల్లాకు పలు సార్లు వచ్చారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో 2000 మార్చి 27న జిల్లా కళాకారుల ఐక్యవేదిక నిర్వహించిన మిలీనియం కళా పురస్కార ఉత్సవాల్లో కృష్ణ తన సతీమణి విజయనిర్మలతో కలిసి పాల్గొన్నారు. ఐక్యవేదిక ప్రతినిధులు వీ.వీ.అప్పారావు, డాక్టర్ నాగబత్తిని రవికుమార్ ఆధ్వర్యాన కృష్ణకు ఎన్టీఆర్ పురస్కారం, విజయనిర్మలకు మిలీనియం కళా పురస్కారం అందించి సన్మానించారు. అలాగే, ఖమ్మం కమాన్ బజార్లో ఏర్పాటు చేసిన విమల్ షోరూం ప్రారంభోత్సవానికి కృష్ణ వచ్చిన సమయాన ఉమ్మడి జిల్లా కృష్ణ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బాబాజీ, గౌరవ అధ్యక్షుడు తోట రంగారావు ఆయనకు జ్ఞాపిక అందించారు. (చదవండి: ఇకపై అవేవి ఇంతకు ముందులా ఉండవు, మిస్ యూ తాతయ్య: సితార ఎమోషనల్) సినిమా షూటింగ్లో కృష్ణతో అభిమానులు తోట రంగారావు, తదితరులు (ఫైల్) ఇక భద్రాచలం అడవులు, గోదావరి తీరంలో జరిగిన ఎన్కౌంటర్ సినిమా షూటింగ్లో నూ సూపర్ స్టార్ పాల్గొన్నారు. కాగా, మాజీ మంత్రి జలగం ప్రసాదరావుతో కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ప్రసాదరావు ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయాన ప్రచారానికి హాజరయ్యారు. నేతలతో పాటు అభిమానుల సంతాపం ఖమ్మం మయూరిసెంటర్ : సూపర్‌స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు తెలి యగానే ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలువురు ఆయన చిత్రపటాల వద్ద నివాళులర్పించగా కొందరు కృష్ణకు కడసారి వీడ్కోలు పలికేందుకు హైదరాబాద్ వెళ్లారు. అలాగే, సీఎం కేసీఆర్‌తో కలిసి కృష్ణ నివాసానికి వెళ్లిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించడమే కాక మహేష్‌బాబు, కుటుంబీకులను ఓదార్చారు. ఇక ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా కృష్ణ మృతిపై సంతాపం ప్రకటించారు. (చదవండి: సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా?) -
మహేశ్‌బాబును అలా ఎన్నడూ చూడలేదు: పరుచూరి గోపాలకృష్ణ
టాలీవుడ్ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విశ్లేషకుడిగా మారిన విషయం తెలిసిందే! ఏదైనా సినిమాను తీసుకుని అందులో తప్పొప్పులను చర్చిస్తూ ఆ లోపాలను సవరిస్తున్నాడు. ఈ మధ్యే వారియర్ సినిమాలోని ప్లస్ మైనస్‌ల గురించి వీడియో చేసిన ఆయన తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు కుటుంబం గురించి మాట్లాడాడు. ఇటీవలే ఇందిరా దేవిని పోగొట్టుకుని మహేశ్ ఫ్యామిలీ పుట్టెడు శోకంలో మునిగిపోయింది. ఆమె సంస్మరణ సభకు పరుచూరి గోపాలకృష్ణ కూడా హాజరయ్యాడు. ఆ సమయంలో మహేశ్, కృష్ణల పరిస్థితి చూసి విలవిల్లాడిపోయానన్నాడు పరుచూరి. 'ఘట్టమనేని కుటుంబంతో నాకున్న అనుబంధాన్ని ఎన్నోసార్లు తెలియజేశాను. కృష్ణ, మహేశ్‌బాబు, రమేశ్ బాబు, హనుమంతురావు, ఆది శేషగిరిరావు గారితో.. వీరందరితో కుటుంబంలో కుటుంబంలా కలిసిపోయాం. నేను అమెరికా నుంచి వచ్చేలోగా మహేశ్ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారని తెలిసింది. ఏకాదశి నాడు వారిని కలిశాను. అప్పుడు కృష్ణగారిని చూస్తే గుండె తరుక్కుపోయింది. ఇన్ని సంవత్సరాల కాలంలో మహేశ్‌బాబును అంత డల్‌గా ఎప్పుడూ చూడలేదు. ఇందిరమ్మ అంటే మా దృష్టిలో మహాలక్ష్మి, దేవత. ఆమె ఎక్కువ మాట్లాడరు, కేవలం చిన్న చిరునవ్వుతో పలకరిస్తుంటారు. ఆమె మరణించాక కృష్ణగారి ముఖం చూసి ఎంతో ఆవేదన చెందాను. సామాన్యంగా అలాంటి సందర్భాల్లో మనం తల్లడిల్లిపోతాం. కానీ సాహసమే ఆయన ఊపిరి అన్నట్లుగా గుండెనిబ్బరం చేసుకుని కూర్చున్నారు. మహేశ్‌బాబును చిరునవ్వు లేకుండా అలా దిగులుగా చూడటం ఇదే మొదటిసారి. అలాంటి రోజు వస్తుందనుకోలేదు. ఆయనకు కోపం వచ్చినప్పుడు కూడా పెదాలపై చిరునవ్వు ఉండేది. అలాంటిది ఆ తల్లి జ్ఞాపకాల్లో మహేశ్ పెదాలపై చిరునవ్వు మాయమైంది. మహేశ్‌బాబు కాశీకి కూడా వెళ్లి వచ్చాడు. తల్లిని గుర్తు చేసుకుంటూ తండ్రిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: కొత్త కారు ఇంటికి తెచ్చిన సింగర్ ప్రముఖ బుల్లితెర నటికి క్యాన్సర్? -
మమ్మీ మా గుండెల్లో ఎప్పుడు జీవించే ఉంటారు.. నమ్రత ఎమోషనల్ పోస్ట్
హీరో మహేశ్ బాబు తల్లి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా మహేశ్ భార్య, నటి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు. అత్త ఇందిరా దేవిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. నమ్రత శిరోద్కర్ రాస్తూ.. 'జీవితం అనేది ఒక సర్కిల్ లాంటిది. ఇప్పుడు నా జీవితం ఇదే. మామయ్య గారు మా జీవితంలో ఉన్నందుకు మాకు సంతోషం. అమ్మ ఇందిరాదేవి ఇప్పుడు మా మధ్య లేకపోయినా ఆమె మా గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటుంది. మేం జీవించి ఉన్నంత వరకు ప్రతి రోజూ ఆమెను గుర్తు చేసుకుంటాం. ఆమె మా కుటుంబాన్ని కాపాడుతుందని మాకు తెలుసు.. లవ్ యూ మమ్మీ' అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇటీవలే ఇందిరా దేవి పెద్దకర్మ కూడా నిర్వహించారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి సంస్మరణ సభ(ఫోటోలు)
-
దివంగత ఇందిరా దేవి 11వ రోజు కార్యక్రమం( ఫోటోలు)
-
Mahesh Babu: మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి స్వస్థలమేదో తెలుసా?
బూర్గంపాడు (భద్రాద్రి కొత్తగూడెం): ప్రముఖ సినీ నటుడు సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ సతీమణి, హీరో మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి (70) మృతితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో విషాదఛాయలు అలుము కున్నాయి. మండలంలోని ముసలిమడుగు ఆమె స్వగ్రామం. కృష్ణను వివాహమాడాక పిల్లలు రమేష్‌బాబు, మహేష్‌బాబులతో తరచుగా ముసలిమడుగు వచ్చివెళ్లేవారు. ఆమె ఎప్పుడు వచ్చినా అందరినీ అప్యాయంగా పలకరించేవారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికీ ముసలిమడుగులో ఇందిరాదేవి పేరిట ఇల్లు ఉంది. పక్కనే ఉన్న లక్ష్మీపురంలో ఇందిరాదేవితోపాటు ఆమె కుమారులు, కుమార్తెల పేరిట వ్యవసాయ భూములున్నాయి. ఇందిరాదేవి పేరిట ఉన్న ఇంటి స్థానంలో భద్రాచలం వచ్చే భక్తుల కోసం వసతిగృహం నిర్మించాలని కుటుంబసభ్యులు యోచిస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందిరాదేవి అంత్యక్రియలు జూబ్లిహిల్స్‌లోని మహా ప్రస్థానంలో జరిగాయి. ఈ క్రతువును మహేష్‌బాబు నిర్వహించారు. (చదవండి: మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్) -
మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్
నానమ్మను తలుచుకుంటూ సితార సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యింది. నిన్న(సెప్టెంబర్ 28) సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే నానమ్మను తలుచుకుంటూ సితార ఆమె పార్థివదేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యం అందరిని కలిచి వేసింది. కూతురు ఏడుస్తుంటే తండ్రి మహేశ్ ఆమెను ఓదార్చిన సన్నివేశం అభిమానుల హృదయాలను ఆకట్టుకుంది. బుధవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించారు. చదవండి: నానమ్మను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సితార అనంతరం ఆమెను తలుచుకుంటూ మహేశ్, ఆయన భార్య నమ్రత శిరొద్కర్, సితారలు సోషల్ మీడియా వేదికగాఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వారు భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ముఖ్యంగా సితార షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల హృదయాలను హత్తుకుంటుంది. ‘మిస్ యూ సో మచ్ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అంటూ నానమ్మ, అన్న గౌతమ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది సితార. దీనికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జత చేస్తూ భావోద్వేగానికి గురైంది. ఇక ఇది చూసి ‘నానమ్మ అంటే సితూ పాపలకు ఎంత ఇష్టమో’, ‘ఈ పోస్ట్‌తో సితార తన నానమ్మతో ఉన్న అనుబంధం తెలుస్తుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఏ స్పెషల్ అకేషన్ ఉన్న సితార, గౌతమ్‌లు నానమ్మతో కలిసి సరదా సమయాన్ని గడిపేవారనే విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మహేష్ బాబుని ఇంత ఎమోషనల్ గా ఎప్పుడు చూసి ఉండరు
-
ముగిసిన ఇందిరాదేవి అంత్యక్రియలు
సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి అంత్యక్రియలు ముగిశాయి. పద్మాలయ స్టూడియో నుంచి జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో మహేష్ బాబు తల్లి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమ అభిమాన హీరో తల్లిని కడసారి చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. ఇందిరాదేవి పార్థివ దేహాన్ని చూసి కృష్ణ, మహేశ్ బాబు చలించిపోయారు. ఇద్దరూ కన్నీంటి పర్యంతమయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి.. బుధవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, ప్రముఖుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలోకి తరలించారు. అనంతరం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. ఈ కార్యక్రమానికి మీడియాకు అనుమతి ఇవ్వలేదు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహేష్‌బాబుకు మాతృ వియోగం.. ఇందిరా దేవి పార్థీవదేహానికి ప్రముఖుల నివాళి (ఫొటోలు)
-
ఇందిరా దేవి పార్థీవదేహానికి కుటుంబ సభ్యుల నివాళులు (ఫొటోలు)
-
Indira Devi: నానమ్మను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సితార
-
నానమ్మను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సితార
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి మృతితో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. బుధవారం ఉదయం స్టార్ హీరో మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణం మహేశ్ కుటుంబం, ఇతర కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. ఇక నానమ్మ మరణంతో మహేశ్ కూతురు సితార ఏడుస్తున్న దృశ్యం అందరిని చేత కంటతడి పెట్టిస్తోంది. తండ్రి మహేశ్‌ని పట్టుకుని నానమ్మను తలుచుకుంటూ సితూ పాప వెక్కె వెక్కి ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సితార ఏడుస్తుంటే మహేశ్ ఆమెను ఓదారుస్తున్నాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మహేశ్ బాబు ఇంటికి సినీ ప్రముఖులు, ఇందిరా దేవికి నివాళులు మహేశ్ బాబు తల్లి మృతి.. చిరంజీవి సంతాపం -
అమ్మ చేతి కాఫీ.. దేవుడి ప్రసాదంతో సమానం: మహేశ్ ఎమోషనల్
‘ఎంతమందికి తెలుసో..తెలియదు కాని ఏప్రిల్ 20న మా అమ్మ ఇందిరమ్మగారి పుట్టిన రోజు. అమ్మ ఆశిస్సులు, దీవెనలకు మించిదేది ఉండదు. ఆ రోజున నా సినిమా విడుదల కావడం నిజంగా సంతోషంగా ఉంది. అమ్మగారి ఆశిస్సులు నాకు చాలా ముఖ్యమైనవి’.. ఇవి ‘భరత్ అనే నేను’ ప్రీరిలీజ్ ఈవెంట్లో తన తల్లి గురించి మాట్లాడిన మాటలు. మహేశ్ బాబుకు తన మాతృమూర్తి తో ఎంతో అనుబంధం ఉంది. అమ్మ పట్ల తనకున్న ఇష్టాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా అభిమానులతో పంచుకునేవాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) "Naaku Amma Ante Devudutho Samanam" ❤️🙏 This is a very huge loss to Superstar #MaheshBabu!! 💔💔#RIPIndiraDeviGaru #IndiraDevi #Indiramma #TeluguFilmNagar pic.twitter.com/krtRqemJZw — Telugu FilmNagar (@telugufilmnagar) September 28, 2022 మహర్షి సినిమా సక్సెస్ మీట్లో కూడా తల్లి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ‘నాకు అమ్మంటే నాకు దేవుడితో సమానం. సినిమా విడుదలకు ముందు అమ్మదగ్గరకు వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగినే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది. ఆమె ఆశీస్సులు నాకెప్పటికీ ముఖ్యం’అని మహేశ్ అన్నారు. బుధవారం(సెప్టెంబర్ 28)తెల్లవారు జామున ఇందిరాదేవి మరణంతో గతంలో తల్లి గురించి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాతృమూర్తి పట్లకు మహేశ్‌కు ఉన్న ప్రేమను గుర్తు చేసుకుంటూ సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఆ వీడియోలను షేర్ చేస్తూ..‘ధైర్యంగా ఉండండి అన్నా’అంటూ కామెంట్ చేస్తున్నారు. మహేశ్ నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలోని తల్లి సెంటిమెంట్ సీన్‌ను కూడా షేర్ చేస్తున్నారు. RIP Amma 🙏 Stay Strong @urstrulyMahesh Anna 💔#MaheshBabu 😓 pic.twitter.com/e6wTJxG4Au — Sardaar S (@SardaarSainik) September 28, 2022 చదవండి: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం ఒకే ఏడాది రెండు విషాదాలు..తీవ్ర దుఃఖంలో మహేశ్ తల్లి మృతితో శోకసంద్రంలో మహేశ్‌బాబు -
మహేశ్ బాబు ఇంటికి సినీ ప్రముఖులు, ఇందిరా దేవికి నివాళులు
హీరో మహేశ్ బాబు తల్లి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి బుధవారం ఉదయం మృతి చెందారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇందిరా దేవి మృతికి నివాళులు అర్పించేదుకు సినీ, రాజకీయ ప్రముఖులు మహేశ్ ఇంటికి తరలివస్తున్నారు. విక్టరి వెంకటేశ్, నాగార్జున అక్కినేని, మోహన్ బాబు, డైరెక్టర్ రాఘవేంద్ర రావు, నిర్మాత అల్లు అరవింద్, ఇతర హీరోలు, నటీనటులు మహేశ్ ఇంటికి చేరుకుని ఇందిరా దేవి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం మహేశ్, కృష్ణను వారంతా పరామర్శించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఇందిరాదేవి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి. -
ఇందిరాదేవి మరణవార్త కలచివేసింది : చిరంజీవి ట్వీట్
-
ఒకే ఏడాది రెండు విషాదాలు..తీవ్ర దుఃఖంలో మహేశ్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి ఇందిరాదేవి(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కాగా ఈ ఏడాది జనవరిలోనే మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో జనవరి 8న తుదిశ్వాస విడిచారు. దీంతో ఒకే ఏడాదిలో సూపర్ స్టార్ ఇంట్లో రెండు తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి. అన్నయ్యను కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే, తల్లి దూరం అవ్వడం మహేశ్‌ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. మహేశ్‌కు తల్లిపై ఎనలేని ప్రేమ ఉండేది. నమ్రతతో వివాహం జరిగే వరకు తల్లి చాటు బిడ్డగానే పెరిగాడు. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలో మహేశ్ బాబే స్వయంగా చెప్పారు. సందర్భం వచ్చినప్పుడల్లా తల్లితో తనకున్న అనుబంధాన్ని వెల్లడించేవాడు. ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వెళితే తల్లి చేయి పట్టుకొని పక్కనే ఉండేవాడు. ఇందిరాదేవికి కూడా చిన్న కొడుకు మహేశ్ అంటే చాలా ఇష్టం ఉండేది. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఇందిరాదేవి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Indira Devi Death: తల్లి మృతితో శోకసంద్రంలో మహేశ్‌బాబు
తల్లి ఇందిరా దేవి(70) మృతితో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఏడాది జనవరిలోనే సోదరుడు రమేశ్ బాబు మరణించడం, ఇప్పుడు తల్లి కూడా చనిపోవడంతో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరయ్యింది. మహేశ్‌కు తల్లి ఇందిరా దేవిపై అపురూపమైన ప్రేమ. పలు సందర్భల్లో ఆమె ప్రస్తావన రాగానే ఎంతో ఎమోషనల్ అయ్యాడు. పెళ్లికిముందు వరకు ఆయన తల్లి చాటునే పెరిగాడు. అందుకే ఆమె అంటే అంత ప్రేమ. ఓ వివాహ వేడుకకు ఇందిర వచ్చినప్పుడు మహేశ్‌బాబు ఆమెను రిసీవ్ చేసుకున్న విధానం అందరినీ ఆకర్షించింది. తండ్రికి రెండో వివాహం.. అందుకే తల్లి చాటున ఇందిరా దేవి సూపర్ స్టార్ కృష్ణ మామ కూతురే. వరసకు మరదలు. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొన్నాళ్లకే కుటుంబసభ్యుల సలహా మేరకు ఇందిరను పెళ్లి చేసుకున్నారు కృష్ణ. అయితే ఆ తర్వాత విజయ నిర్మలతో వరుసగా సినిమాలు తీయడంతో ఆమెతో ప్రేమలో పడ్డారు. దీంతో ఇందిరతో పెళ్లైన నాలుగేళ్లకే.. విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు కృష్ణ. పెళ్లి విషయాన్ని ఇందిరకు చెప్పారు. ఆ తర్వాత కూడా అందరూ కలిసే ఉన్నారు. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఇందిరా దేవి ఎప్పుడూ బయటకు రాలేదు. ఫంక్షన్లలోనూ అరుదుగా కనిపించారు. ఎమోషనల్ పోస్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 20న ఇందిరా దేవి పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు చాలా ప్రత్యేకంగా ట్విట్టర్లో ఎమోషనల్ పోస్టు పెట్టాడు. అమ్మా మీరు నా తల్లికావడం అదృష్టం. మీ గురించి చెప్పడానికి ఒక్కరోజు సరిపోదు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని ట్వీట్ చేశాడు. మహేశ్ తన మాతృమూర్తి పట్ల చూపించిన ప్రేమను చూసి ఆయన అభిమానులు మురిసిపోయారు. కానీ ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె ప్రాణాలు కోల్పోవడం మహేశ్‌తో పాటు అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Happy birthday Amma ♥️ Thank you for being the blessing you are. One day is never truly enough! Love you always 🤗🤗🤗 pic.twitter.com/92aqNPmUQR — Mahesh Babu (@urstrulyMahesh) April 20, 2022 చదవండి: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం -
Indira Devi: మహేశ్ బాబు తల్లి మృతి.. చిరంజీవి సంతాపం
సూపర్ స్టార్ మహేశ్ ఇంట త్రీవ విషాదం నెలకొంది. ఆయన తల్లి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి బుధవారం ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఇందిరా దేవి మరణం మహేశ్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు, హీరోలు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. మహేశ్ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. చదవండి: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం అలాగే మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ ఇందిరా దేవికి నివాళులు అర్పించారు. ‘శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబుకి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అని చిరు ట్వీట్ చేశారు. శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ 🙏, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. — Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022 సూపర్ స్టార్ కృష్ణ గారి అర్ధాంగి మహేష్ బాబు మదర్ శ్రీమతి ఇందిరాదేవి గారు ఈరోజు ఉదయం కన్నమూశారు. pic.twitter.com/0Wzu0IcygE — Suresh Kondeti (@santoshamsuresh) September 28, 2022 I was devastated by the tragedies in Super Star Krishna garu's family and the demise of Srimathi Indiramma garu struck me very hard. I have great admiration for this affectionate family and highest respect for Indiramma garu. — Sreenu Vaitla (@SreenuVaitla) September 28, 2022 ఇందిరమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ 🙏 pic.twitter.com/Dgkiorz6Yh — BANDLA GANESH. (@ganeshbandla) September 28, 2022 Superstar @urstrulyMahesh's mother Indira Devi garu passed away. May her soul Rest In Peace 🙏🙏 Our Deepest Condolences to #Krishna garu, #MaheshBabu garu and the whole family.. pic.twitter.com/ZM74sfdYf7 — SVCC (@SVCCofficial) September 28, 2022 మీకెంతో ఇష్టమైన ప్రాణానికి ప్రాణమైన అమ్మగారు వెళిపోయారన్న వార్త చాలా బాధాకరం @urstrulyMahesh గారు . వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను🙏🙏🙏 pic.twitter.com/5MtnZsPRQA — RamajogaiahSastry (@ramjowrites) September 28, 2022 Superstar @urstrulyMahesh's mother #IndiraDevi garu is no more. May her soul Rest In Peace 🙏🙏 Our Deepest Condolences to #Krishna garu,#MaheshBabu garu and the whole family. pic.twitter.com/ocS5RxgsOy — Kona Film Corporation (@KonaFilmCorp) September 28, 2022 It's very unfortunate to hear the sudden demise of @urstrulyMahesh's mother Indira Devi garu 🙏💐. Our Deepest condolences to #Krishna garu and the whole family. Om Shanti 🙏 pic.twitter.com/Sg67IAI5kw — UV Creations (@UV_Creations) September 28, 2022 -
Indira Devi Death: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇందిరా దేవికి రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఐదుగురు సంతానం. అభిమానుల సందర్శనార్థం ఇందిరా దేవీ భౌతిక కాయాన్ని పద్మాలయ స్టూడియోస్కి తరలిస్తారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జనవరిలోనే రమేశ్ బాబు(56) మృతిచెందారు. ఏడాది తిరగకముందే ఇందిరా దేవి కూడా కన్నుమూయడం కృష్ణ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కాగా.. ఇందిరా దేవి మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. తీవ్ర దుఃఖంలో ఉన్న కృష్ణ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


