Chiranjeevi Meets Mahesh Babu And Krishna Over Indira Devi Death, Details Inside - Sakshi
Sakshi News home page

Chiranjeevi Meets Mahesh Babu And Family: మహేశ్‌ బాబు, కృష్ణలను పరామర్శించిన చిరంజీవి

Sep 29 2022 1:13 PM | Updated on Sep 29 2022 1:27 PM

Chiranjeevi Meets Mahesh Babu And Krishna Over Indira Devi Demise - Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేశ్‌ బాబులను తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి పరామర్శించారు. గురువారం వారి ఇంటికి వెళ్లి మహేశ్‌, కృష్ణలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణ సతీమణి, మహేశ్‌ తల్లి ఇందిరా దేవి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు చిరు సంతాపం తెలిపారు. కాగా బుధవారం(సెప్టెంబర్‌ 28న) మహేశ్‌ తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

చదవండి: మిస్‌ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్‌ పోస్ట్‌

సినీ, రాజకీయ ప్రముఖులు నిన్న మహేశ్‌ ఇంటికి వెళ్లి ఇందిరా దేవి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఇక ఆమె అంత్యక్రియల్లో విక్టర్‌ వెంకటేశ్‌, నాగార్జున అక్కినేని, మోహన్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌తో పాటు పలువురు హీరోలు, దర్శకులు పాల్గొన్నారు. అయితే చిరు తాజా చిత్రం గాడ్‌ ఫాదర్‌ ట్రైలర్‌ ఈవెంట్‌ నిన్న అనంతపురంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నేపథ్యంలో బుధవారం ఇందిరా దేవి అంత్యక్రియల్లో ఆయన పాల్గొన లేకపోయారు. 

Advertisement
 
Advertisement
Advertisement