Megastar Chiranjeevi Bhola Shankar Movie Pooja Ceremony Photos Goes Viral - Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా ప్రారంభమైన ‘భోళా శంకర్‌’.. ఫోటోలు వైరల్‌

Nov 11 2021 8:35 AM | Updated on Nov 12 2021 7:48 AM

Chiranjeevi Bhola Shankar Movie Pooja Ceremony Photos Goes Viral - Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’ షూటింగ్‌ ప్రారంభైమంది. గురువారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో భోళా శంకర్ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను ఘనంగా ప్రారంభించారు చిరంజీవి.

ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్‌ ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్‌, హరీశ్‌ శంకర్‌, బాబీ, గోపీచంద్‌ మలినేని, వంశీ పైడిపల్లి, కొరటాల శివ తదితరులు పాల్గొని, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ అందించారు. ముహుర్తపు షాట్‌లో భాగంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిరుపై క్లాప్‌ కొట్టారు.

ఇక భోళా శంకర్‌ విషయానికొస్తే.. తమిళ సూపర్‌ హిట్‌ మూవీ వేదాళం తెలుగు రీమేక్‏ ఇది. . చిరంజీవి కెరీర్‏లో 154వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా తమన్నా, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఈనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement