'ఛావా' తెలుగులో కలెక్షన్స్‌ రికార్డ్‌.. క్లైమాక్స్‌ మేకింగ్‌ వీడియో చూశారా..? | Chhaava Telugu Collection And Climax Making Video | Sakshi
Sakshi News home page

'ఛావా' తెలుగులో కలెక్షన్స్‌ రికార్డ్‌.. క్లైమాక్స్‌ మేకింగ్‌ వీడియో చూశారా..?

Published Tue, Mar 11 2025 12:19 PM | Last Updated on Tue, Mar 11 2025 12:30 PM

Chhaava Telugu Collection And Climax Making Video

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమా 'ఛావా' తెలుగులో కూడా భారీ కలెక్షన్స్‌ నమోదు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఛావా తెలుగు వర్షన్‌ కలెక్షన్స్‌తో పాటు సినిమాలోని క్లైమాక్స్‌ సీన్‌ మేకింగ్‌ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్‌ ఈ మూవీ కోసం ఎంతలా కష్టపడ్డారో అందులో చూపించారు. ఔరంగజేబు పాత్రతో అక్షయ్‌ ఖన్నా మేకింగ్‌ విధానాన్ని కూడా చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 530 కోట్ల మార్క్‌ను ఛావా చేరుకుంది. తెలుగు వర్షన్‌లో మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 10.91 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టినట్లు గీతా ఆర్ట్స్‌ పేర్కొంది.

ఫిబ్రవరి 14న హిందీ వర్షన్‌లో మాత్రమే విడుదలైన ఈ మూవీ తెలుగు డబ్బింగ్‌లో మార్చి 7న థియేటర్స్‌లోకి వచ్చేసింది.  ఈ ఏడాది బాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఛావా రికార్డు నెలకొల్పింది. మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైనప్పటికీ కలెక్షన్స్‌ పరంగా దుమ్మురేపుతుంది. ఫైనల్‌గా రూ. 20 కోట్ల మార్క్‌ను ఛావా టాలీవుడ్‌లో అందుకుంటుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.

ఛావా క్లైమాక్స్‌ మేకింగ్‌
ఛావా సినిమాలో సంగమేశ్వర్‌ వద్ద జరిగిన క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ చాలా కీలకంగా ఉంటుంది. మూవీకి అత్యంత బలాన్ని ఇచ్చే ఈ సీన్‌ను ఎలా తెరకెక్కించారో ప్రేక్షకులకు చూపారు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్‌ను ఎలా రెడీ చేశారో చూపారు.  శంభాజీ మహారాజ్‌గా కనిపించేందుకు తాను ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు విక్కీ కౌశల్‌ ఇప్పటికే చెప్పారు. రోజుకు ఆరు నుంచి 8 గంటలకు పైగానే శిక్షణ కోసమే కేటాయించానని ఆయన అన్నారు. ఆయనలా ధృఢమైన శరీరంతో కనిపించేందుకు కండలు పెంచడమే కాకుండా సుమారు 100 కేజీల వరకు విక్కీ బరువు పెరిగిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement