చివరి దశకు చేరుకున్న చంద్రముఖి 2 షూటింగ్‌ | Chandramukhi 2 Movie Shooting Update | Sakshi
Sakshi News home page

Chandramukhi 2: ఇంకా పదిరోజులు షూటింగ్‌ చేస్తే చంద్రముఖి 2 పూర్తి!

May 15 2023 6:49 AM | Updated on May 15 2023 8:09 AM

Chandramukhi 2 Movie Shooting Update - Sakshi

చంద్రముఖి–2 చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని దర్శకుడు తెలిపారు. ఇంకా 10 రోజులు షూటింగ్‌ చేస్తే మొత్తం పూర్తవుతుందని ఆయన చెప్పారు. తదుపరి షూటింగ్‌ను

రజనీకాంత్‌, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం చంద్రముఖి. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సుమారు 17 ఏళ్ల తరువాత దానికి సీక్వెల్‌గా చంద్రముఖి–2 సినిమాను దర్శకుడు పి.వాసునే తెరకెక్కిస్తున్నారు. ఇందులో లారెన్స్‌ కథానాయకుడిగా నటిస్తుండగా బాలీవుడ్‌ సంచలన నటి కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు.

వడివేలు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని, ఆర్‌డీ రాజశేఖర్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ అధిక భాగం పూర్తయినట్లు చిత్ర వర్గాలు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అదే విధంగా కంగనా రనౌత్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు ఆమె స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

కాగా చంద్రముఖి–2 చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని దర్శకుడు తెలిపారు. ఇంకా 10 రోజులు షూటింగ్‌ చేస్తే మొత్తం పూర్తవుతుందని ఆయన చెప్పారు. తదుపరి షూటింగ్‌ను మైసూరులో నిర్వహించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. నిర్మాణాంతర కార్యక్రమాలు నిర్వహించి త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. కాగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చాలా గ్యాప్‌ తరువాత తమిళంలో చేస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

చదవండి: నిశ్చితార్థం రద్దు చేసుకున్న శర్వానంద్‌? ఇదిగో క్లారిటీ!

Advertisement
 
Advertisement
Advertisement