Ananta Sriram: ‘దిగు దిగు నాగ’ పాటపై తీవ్ర దుమారం

Brahmana Association Filed Complaint On Lyricist  Ananta Sriram - Sakshi

నెల్లూరు: ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్‌ చిక్కుల్లో పడ్డారు. ఇటీవలె వరుడు కావలెను సినిమాలో అనంత శ్రీరామ్ రాసిన ‘దిగు దిగు నాగ’ పాటపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. దేవతలను కించపరిచేలా లిరిక్స్‌ ఉన్నాయంటూ అనంత శ్రీరామ్‌పై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు చిల్లకూరు పీఎస్‌లో అనంత శ్రీరామ్‌పై బ్రాహ్మణ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఒరిజినల్ పాటలో ఉన్న అద్భుతమైన భావాన్ని పాడు చేశారని, డబ్బు కోసం దేవతలకు కించపరుస్తున్నరంటూ మండిపడ్డాయి.

నాగ ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బ్రాహ్మణ సంఘాలు అనంత శ్రీరామ్‌కు ఉన్న మంద బుద్ది పోవాలంటూ చురకలంటించారు. వెంటనే చిత్రం నుంచి ఈ పాటను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ వెంకటగిరిలో నిరసనకు దిగారు. ఇప్పటికే అనంత శ్రీరామ్‌పై  బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు  నెల్లూరులోని చిల్లకూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా నాగశౌర్య, రీతూ వర్మలు హీరో హీరోయిన్లుగా నటించిన వరుడు కావలెను చిత్రానికి లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top