Boycott Toofaan: ఈ సినిమాను చూడొద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు, ఎందుకంటే..

Boycott Toofaan మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమాకు సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్, మ్రునాల్ థాకూర్ జోడిగా నటించిన ‘తూఫాన్’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ లో చూడొద్దంటూ రిక్వెస్టులు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో గత రాత్రి చెలరేగిన దుమారం.. ఇంకా నడుస్తూనే వస్తోంది.
తూఫాన్ కథలో భాగంగా ఫర్హాన్‌ది ఒక గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. ప్రియురాలు మ్రునాల్ ప్రోత్సాహంతో బాక్సింగ్ ఛాంపియన్‌గా మారతాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇందులో ఫర్హాన్ క్యారెక్టర్ పేరు అజిజ్ అలీ. మ్రునాల్ పాత్ర పేరు డాక్టర్ పూజా షా. ఈ పేర్లే అభ్యంతరాలకు కారణం అయ్యాయి. బాయ్‌కాట్ తూఫాన్‌కు బలం ఇచ్చాయి. ఇది సంప్రదాయానికి విరుద్ధం, మతాంతర కథలను ప్రోత్సహించకూడదని కొందరు వాదిస్తున్నారు. అయితే గతంలో సీఏఏకి వ్యతిరేకంగా ఫర్హాన్ నిరసనల్లో పాల్గొన్నాడు. దీంతో రివెంజ్ తీర్చుకునేందుకు టైం వచ్చిందని మరికొందరు ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌లో చేతులు కలపడం విశేషం.
Trending in India 🇮🇳
Say Loudly #BoycottToofaan 📢@beingarun28 pic.twitter.com/XfSxne5sy1
— Keshav Pandey (@KeshavPandeyWB) July 10, 2021
Remember this 👇#BoycottToofaan pic.twitter.com/32ZKNvpDtz
— कुंवर अजयप्रताप सिंह 🇮🇳 (@iSengarAjayy) July 10, 2021
ఇదిలా ఉంటే ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత.. మరోసారి ‘తూఫాన్’ కోసం ఒళ్లు హూనం చేసుకున్నాడు ఫర్హాన్. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో విలక్షణ నటుడు పరేష్ రావెల్, ఫర్హాన్‌కు కోచ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. షెడ్యూల్ ప్రకారం.. జులై 16న అమెజాన్ ప్రైమ్‌లో ‘తూఫాన్’ స్ట్రీమింగ్ కానుంది.
It took about two years to bring the boxer persona to life. This wouldn't have been possible without the belief & support of this amazing team. Watch my boxing journey here.https://t.co/T5ccRHIlYu@excelmovies @PrimeVideoIN
— Farhan Akhtar (@FarOutAkhtar) July 9, 2021