Boney Kapoor About Ajith: Boney Kapoor Talks About Valimai Movie In Pre-release Event - Sakshi
Sakshi News home page

Valimai: ఆ ఇద్దరూ చాలా ఫోకస్డ్‌గా ఉంటారు: బోనీ కపూర్‌

Feb 24 2022 8:21 AM | Updated on Feb 24 2022 11:23 AM

Boney Kapoor Talk About Valimai Movie - Sakshi

హెచ్‌. వినోద్, గోపీచంద్, హ్యూమా ఖురేషి, బోనీ కపూర్, కార్తికేయ

‘‘బాపూగారు దర్శకత్వం వహించిన ‘మన ఊరి పాండవులు’ సినిమాను హిందీలో ‘హమ్‌ హై పాంచ్‌’గా రీమేక్‌ చేశాను. ఈ రీమేక్‌తోనే నిర్మాతగా నా కెరీర్‌ ప్రారంభమైంది’’ అన్నారు బోనీ కపూర్‌. అజిత్‌ హీరోగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వలిమై’. కీలక పాత్రలో హ్యూమా ఖురేషీ, విలన్‌గా కార్తికేయ నటించారు. బోనీ కపూర్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 24) విడుదలవుతోంది. తెలుగులో ఇనుమూరి గోపీచంద్‌ విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బోనీ కపూర్‌ మాట్లాడుతూ – ‘‘అజిత్, వినోద్‌ చాలా ఫోకస్డ్‌గా ఉంటారు. వీరి కాంబినేషన్‌లో మూడో సినిమా చేస్తున్నాను. కార్తికేయ ఆఫ్‌ స్క్రీన్‌లో కూల్‌గా ఉంటాడు కానీ ఆన్‌ స్క్రీన్‌పై షేర్‌లా యాక్ట్‌ చేస్తాడు. నా కుమార్తె జాన్వీ కపూర్‌ దక్షిణాది భాషల్లో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. తెలుగులో యాక్ట్‌ చేసేందుకు మంచి కథ కోసం ఎదురుచూస్తోంది’’ అన్నారు. ‘‘శ్రీదేవిగారి బ్యానర్‌ (శ్రీదేవి భర్త బోనీ కపూర్‌)లో యాక్ట్‌ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు కార్తికేయ.  

Advertisement
 
Advertisement
Advertisement