ఆస్పత్రిలో బాలీవుడ్ భామ.. అభిమానులు ఇలా కూడా ఉంటారా? | Bollywood Actress Urvashi Rautela Gets Huge Response From Her Fans For Speedy Recovery, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

Urvashi Rautela: ఆస్పత్రిలో ఊర్వశి రౌతేలా.. ఏకంగా లక్ష పంపిన ఫ్యాన్స్‌!

Aug 27 2024 1:19 PM | Updated on Aug 27 2024 5:34 PM

Bollywood Actress Urvashi Rautela Gets Huge response From Her Fans

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవల ఆస్పత్రిలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తన చేతి వేలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించింది. "నా కోసం ప్రార్థించండి" అంటూ నోట్ రాసుకొచ్చింది. అయితే చిన్న గాయానికే ఇంత బిల్డప్ అవసరమా అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇదంతా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

అయితే తాజాగా ఊర్వశి రౌతేలా మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఎర్రటి గులాబీలతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుంది. తన డైహార్డ్‌ ఫ్యాన్స్  లక్ష గులాబీలు పంపించారంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తాను కోలుకోవాలంటూ కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది ముద్దుగుమ్మ. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. డైహార్డ్ అభిమానులను కలిగి ఉన్న మొట్టమొదటి భారతీయ నటి అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.

కాగా.. చివరిసారిగా గుస్పైథియా అనే చిత్రంలో ఊర్వశి రౌతేలా నటించింది. అంతకుముందు తెలుగులో వాల్తేరు వీరయ్య, అఖిల్ మూవీ ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement