Bigg Boss 6 Telugu Latest Episode Promo: Singer Revanth Became New Captain - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: సూర్యకు షాకిచ్చిన ఇనయ.. గీతూతో పెట్టుకున్న బాలాదిత్య

Oct 7 2022 3:40 PM | Updated on Oct 7 2022 4:55 PM

Bigg Boss Telugu Promo: Singer Revanth Became Captain - Sakshi

ఈ క్రమంలో ఎవరికి నచ్చిన వ్యక్తులకు వారు దండలు వేయగా ఇనయ మాత్రం అనూహ్యంగా సూర్యకు కాకుండా..

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండే కంటెస్టెంట్లకు ఒక్కసారైనా కెప్టెన్‌ కావాలన్న ఆశ ఉంటుంది. ఎందుకంటే అది నామినేషన్‌, ఎలిమినేషన్‌ల నుంచి గట్టెక్కించే మహా ఆయుధం. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌ నడుస్తోంది. కెప్టెన్సీ కంటెండర్స్‌ను ఎంపిక చేసే పనిని బిగ్‌బాస్‌ కీర్తికి అప్పెజెప్పగా ఆమె బాలాదిత్య, రాజశేఖర్‌, రేవంత్‌, గీతూ, సూర్య, ఫైమాలను ఎంచుకుంది. వీరందరూ మొదటి లెవల్‌ గేమ్‌ ఆడగా అందులో టాప్‌లో నిలిచిన సూర్య, బాలాదిత్య, రేవంత్‌లు రెండో లెవల్‌కు సెలక్ట్‌ అయ్యారు. అయితే ఈ ముగ్గురిలో ఒకరిని కెప్టెన్‌గా ఎంచుకోమని బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులను ఆదేశించాడు.

ఎవరి మెడలో ఎక్కువ పూలదండలు పడితే వారే కెప్టెన్‌ అయినట్లని వెల్లడించాడు. ఈ క్రమంలో ఎవరికి నచ్చిన వ్యక్తులకు వారు దండలు వేయగా ఇనయ మాత్రం అనూహ్యంగా సూర్యకు కాకుండా రేవంత్‌కు పూలమాల వేయడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఫైనల్‌గా రేవంత్‌ తొలిసారి కెప్టెన్‌గా అవతరించాడు. మరో పక్క లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో బాలాదిత్య, గీతూకు మధ్య మాటల యుద్ధం జరిగింది. మరి ఈ ఫైట్‌లో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!

చదవండి: మూడుసార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చిన గీతూ
తనను గట్టిగా హగ్‌ చేసుకోవాలి: ఇనయ

Advertisement
 
Advertisement
Advertisement