రేవంత్‌ నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు, ఫైమాతో.. : గీతూ | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu తనను గట్టిగా హగ్‌ చేసుకోవాలి: మనసులో మాట బయటపెట్టిన ఇనయ

Published Thu, Oct 6 2022 11:29 PM

Bigg Boss 6 Telugu: Contestants Reveals Their Wishes - Sakshi

బిగ్‌బాస్‌ 6- ఎపిసోడ్‌ 33 హైలైట్స్‌: బిగ్‌బాస్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ అటు ఇంటిసభ్యులతో పాటు ఇటు ప్రేక్షకులకు కూడా వినోదాన్ని పంచింది. మొత్తంగా ఇలా అయినా జనాలకు కావాల్సినంత ఫన్‌ దొరికింది. అయితే  బర్త్‌డే వేడుకల్లో భాగంగా ఇంటిసభ్యులందరూ తన కోరికలు తీర్చడానికి ప్రయత్నించడంతో, ఈ రోజు హౌస్‌మేట్స్‌ కోరికలను తెలుసుకోవాలనుకున్నాడు బిగ్‌బాస్‌. అందులో భాగంగా కంటెస్టెంట్లు వారి కుటుంబసభ్యులు నెరవేర్చగలిగే కోరికలేంటో చెప్పమని ఆదేశించాడు.

ముందుగా శ్రీహాన్‌ మాట్లాడుతూ.. 'నా బర్త్‌డేకు నా చేతుల మీదుగా శ్రీహాన్‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ద్వారా అనాథలకు, వృద్ధులకు సాయం చేద్దామనుకున్నా. కానీ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నా కాబట్టి సిరి ఆ పని పూర్తి చేయాలి. అలాగే మా అమ్మానాన్నలకు రోజుకొక్కసారైనా ఫోన్‌ చేసి వాళ్లతో మాట్లాడు సిరి' అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. తన గారాలపట్టికి హౌస్‌ నుంచి బయటకు వచ్చాక మంచి పేరు పెడతానంటూ ఎమోషనల్‌ అయ్యాడు బాలాదిత్య.

మా బావ, అమ్మ ఎలా ఉంటున్నారో తెలుసుకోవాలనుందని మనసులో మాటను బయటపెట్టింది ఫైమా. నా తల్లిదండ్రులు మాట్లాడిన ఒక వీడియో బైట్‌ చూపిస్తే అంతే చాలంటూ ఎమోషనలయ్యారు అర్జున్‌, సూర్య. మా అమ్మ బిగ్‌బాస్‌ హౌస్‌కు రావాలి, తనని గట్టిగా హగ్‌ చేసుకోవాలనుంది. తనను మా నాన్న అంత బాగా చూసుకోలేనేమో కానీ ఆయన లేని లోటును మాత్రం గుర్తు చేయను అని ఏడ్చేసింది ఇనయ. మా ఆయన రంగనాథ్‌, కుటుంబం అంతా మాట్లాడిన వీడియో చూపించాలని కోరుకుంటున్నానంది పింకీ.  'ఓరియో నాకు ప్రతిరోజు ముద్దు పెట్టి నిద్ర లేపుతాడు. నా పెంపుడు కుక్కలు ఓరియో, ఫిడోల బొచ్చు కావాలి. అది నాకు చాలా అమూల్యమైనది' అని చెప్పుకొచ్చింది గీతూ.

'అక్టోబర్‌ 27న నా కూతురి బర్త్‌డే. ఆమె పుట్టినరోజు బిగ్‌బాస్‌ హౌస్‌లో జరగాలన్నదే నా కోరిక' అని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. అనంతరం బిగ్‌బాస్‌ ఈ వారం ఎక్కువ ఎంటర్‌టైన్‌ చేసిన ఆరుగురిని కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఎంపిక చేయమని కెప్టెన్‌ కీర్తికి బాధ్యత అప్పజెప్పాడు. దీంతో ఆమె ఫైమా, రేవంత్‌, సూర్య, గీతూ, ఆదిత్య, రాజశేఖర్‌ పేర్లను సూచించింది. వీరు గేమ్‌ ఆడగా.. మొదటి లెవల్‌లో గెలిచి తొలి మూడు స్థానాల్లో ఉన్న సూర్య, బాలాదిత్య, రేవంత్‌ రెండో లెవల్‌కు వెళ్లారు. రెండో లెవల్‌ గేమ్‌ రేపు ప్రసారం కానుంది. అయితే ఈ ముగ్గురిలో రేవంత్‌ గెలిచి కెప్టెన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రేవంత్‌ తన బుగ్గ మీద ముద్దుపెట్టడం నచ్చలేదని అతడితోనే చెప్పింది గీతూ. తనకు అసౌకర్యంగా అనిపించిందని చెప్పడంతో తన తీరు మార్చుకుంటానన్నాడు రేవంత్‌. అలాగే ఫైమా కాళ్లపై పడుకున్నావని, కాస్త వాళ్లు కంఫర్టో కాదో చూసుకోమని సూచించింది గీతూ.

చదవండి: మూడుసార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చిన గీతూ
తండ్రి గురించి చెప్తూ కంటతడి పెట్టిన అర్జున్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement