
మంటల్లో ఫోటో కాలిపోయినా నా గుండెలో మాత్రం నిప్పు వెలుగుతూనే ఉంటుంది.. అని భారీ డైలాగులు కొట్టాడు. నువ్వెప్పుడూ నన్ను నామినేట్ చేయలేదా? అప్పుడు నేను ఇలా
నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్లు హడలెత్తిపోతుంటారు. కొందరేమో దొరికిందే ఛాన్సని అవతలి వారి మీదున్న కోపాన్ని నామినేషన్స్ ద్వారా తీర్చుకుంటారు. మరికొందరేమో మండే రోజే తమలోని కళల్ని బయటకు తీస్తారు. రైతుబిడ్డగా జనాల్లో బీభత్సమైన సింపతీ తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్ రెండో కేటగిరీకి చెందుతాడు. సాధారణ రోజుల్లో తన ధ్యాసంతా గేమ్ మీదే పెడతాడు.. బాగా ఆడతాడు కూడా! కానీ, పొరపాటున తనను ఆటలో నుంచి తీసేసినా.. ఎవరైనా నామినేట్ చేసినా అస్సలు భరించలేడు. విశ్వరూపం చూపిస్తాడు.
ఊరోడు అన్నావ్.. మళ్లీ అనలేదని మాట మార్చావ్
నిన్నటి నామినేషన్స్‌లోనూ అదే జరిగింది. గౌతమ్ తనను నామినేట్ చేసేసరికి తట్టుకోలేకపోయాడు. ఎప్పటిలాగే ఊసరవెల్లిలా రంగులు మార్చాడు. సందీప్ మాస్టర్‌ను ఊరోడు అన్నావు.. తర్వాతేమో అనలేదని మాట మార్చావు.. అలా రెండు మాటలు మాట్లాడటం నచ్చలేదంటూ ప్రశాంత్ ఫోటోను మంటల్లో వేయబోయాడు గౌతమ్. అయితే ప్రశాంత్ మాత్రం.. నేను మాట్లాడాక నా ఫోటోను మంటల్లో వేయు. కాసేపైనా నా ఫోటో చూసుకుంటూ మాట్లాడతా.. గట్లే ఉంటదా అన్న.. ఫోటో చూపెట్టు.. ఎంత బాగుంది.. అంటూ రాగాలు తీశాడు. గౌతమ్ చెప్పిన పాయింట్ ఎలాగూ కరెక్టే కాబట్టి సరిగా ఆన్సర్ ఇవ్వలేక.. అది అయిపోయిన విషయం.. సందీప్‌కు సారీ చెప్పేశానంటూ అపరిచితుడిలా ప్రవర్తించాడు.
ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్..
అంతేకాదు, తన మేనరిజాన్ని చూపిస్తూ అవతలివారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. మంటల్లో ఫోటో కాలిపోయినా నా గుండెలో మాత్రం నిప్పు వెలుగుతూనే ఉంటుంది.. అని భారీ డైలాగులు కొట్టాడు. ఈ యాక్టింగ్ చూసి నవ్వుకున్న గౌతమ్.. నువ్వెప్పుడూ నన్ను నామినేట్ చేయలేదా? అప్పుడు నేను ఇలాగే ప్రవర్తించానా? అని ప్రశ్నించగా ప్రశాంత్ దగ్గరి నుంచి సమాధానమే కరువైంది. పైగా అలాగే ఓవరాక్షన్ చేస్తుండటంతో ఎందుకురా? మంట ఆరదు, నీతి చావదు అన్న మాటలెందుకు? నీ నీతి, నిజాయితీ గురించి నేనేమీ మాట్లాడట్లేదు.. నువ్వు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మరి నాగార్జున సార్ అడిగినప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నావు? ఎందుకేడ్చావు? అదంతా యాక్టింగా? అని వరుస ప్రశ్నలతో ప్రశాంత్‌కు ఇచ్చిపడేశాడు.
వెనక్కు తగ్గని డాక్టర్ బాబు
అయినా ప్రశాంత్ ఓవరాక్టింగ్ చేస్తూనే ఉండటంతో నేనేమీ ఆడిషన్ చేయట్లేదు అని కౌంటరిచ్చాడు డాక్టర్ బాబు. తర్వాత హౌస్‌లో అందికంటే మీరు వీక్‌గా ఉన్నారనిపిస్తోందంటూ భోలె షావళిని నామినేట్ చేశాడు గౌతమ్. దీనికతడు నువ్వు డాక్టర్ అయితే చేయి పట్టుకుని బీపీలు చూడు.. నేను వీక్ అని చెప్పకు అంటూ వెక్కిరిస్తూ పాటలు పాడాడు. అయినా సరే డాక్టర్ బాబు మాత్రం ఎంతో సహనంగా ఉంటూ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. ఇక రైతుబిడ్డ ఇలాగే అతి చేస్తే రానున్న రోజుల్లో ఎలిమినేట్ అవడం ఖాయమే!
చదవండి: భగవంత్ కేసరికి సీక్వెల్.. డైరెక్ట్ ఇంట్రస్టింగ్ కామెంట్స్