Bigg Boss Telugu 6: Marina Abraham Sahni Remuneration For 11 Weeks - Sakshi
Sakshi News home page

Marina Abraham Sahni: మెరీనా 11 వారాల రెమ్యునరేషన్‌ ఎంతంటే?

Nov 21 2022 8:36 PM | Updated on Nov 23 2022 11:37 PM

Bigg Boss Telugu 6: Marina Abraham sahni Remuneration for 11 Weeks - Sakshi

11 వారాలుగా ఇంట్లో అందరి ఆకలి తీర్చి మదర్‌ ఇండియాగా పేరు తెచ్చుకుంది మెరీనా. కయ్యానికి కాలు దువ్వకుండా అందరితో సఖ్యతగా ఉంటూ

బిగ్‌బాస్‌ షోకి వచ్చి బాగుపడ్డవాళ్లూ ఉన్నారు, ఉన్నపేరును చెడగొట్టుకున్నవాళ్లూ ఉన్నారు. ఈ సీజన్‌లో కూడా అంతే.. కొందరు విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకోగా మరికొందరు మాత్రం కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. బాలాదిత్య, వాసంతి, మెరీనా.. ఈ కోవలోకే చెందుతారు. అక్కడక్కడా చిన్నపాటి గొడవలు జరిగినా అవేవీ వీరి ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయలేకపోయాయి. అంతటి మంచి పేరు సంపాదించుకున్నారు వీళ్లంతా.

ఇకపోతే 11 వారాలుగా ఇంట్లో అందరి ఆకలి తీర్చి మదర్‌ ఇండియాగా పేరు తెచ్చుకుంది మెరీనా. కయ్యానికి కాలు దువ్వకుండా అందరితో సఖ్యతగా ఉంటూ మంచితనంతో మెదిలింది. గత కొద్దివారాలుగా ఆటలోనూ ముందుంది. ఈమెకు బిగ్‌బాస్‌ భారీగా ముట్టజెప్పారట. వారానికి 35 వేల రూపాయల చొప్పున పారితోషికం అందించినట్లు తెలుస్తోంది. అలా 11 వారాలకుగానూ దాదాపు రూ.3,85,000 తీసుకుందట.

చదవండి: మెరీనా ఎలిమినేషన్‌కు కారణాలివే!
నువ్వు ఆటకోసం కూడా ఆలోచించావా?: మెరీనాపై యాంకర్‌ వెటకారం ప్రశ్నలు

Advertisement
 
Advertisement
Advertisement