ఎలిమినేషన్‌: బైబై చెప్పేసిన ఆ కంటెస్టెంట్‌! | Bigg Boss Telugu 6 Elimination: Sudeepa Might be Eliminated From BB Show | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu Elimination: ఈ వారం ఆ కంటెస్టెంట్‌ అవుట్‌!

Oct 15 2022 7:41 PM | Updated on Oct 17 2022 4:21 PM

Bigg Boss Telugu 6 Elimination: Sudeepa Might be Eliminated From BB Show - Sakshi

ఈ అంశం అతడికి బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. చివరగా సుదీప, బాలాదిత్య మిగలగా.. వీరిలో

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో మరో ఎలిమినేషన్‌కు ముహూర్తం ఆసన్నమైంది. ఇప్పటికే అభినయ శ్రీ, షాని, నేహా చౌదరి, ఆరోహి, చంటి ఎలిమినేట్‌ అయ్యారు. ఈ క్రమంలో ఆరో వారం ఎవరు ఎలిమినేట్‌ కానున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వారం కీర్తి, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్‌, రాజ్‌, శ్రీసత్య, మెరీనా నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో శ్రీహాన్‌, ఆదిరెడ్డి, గీతూ, శ్రీసత్యలు ఓటింగ్‌లో దుమ్ము దులిపేశారట. రాజ్‌, కీర్తిలకు కూడా బాగానే ఓట్లు పడినట్లు తెలుస్తోంది. మిగిలిన సుదీప, మెరీనా, బాలాదిత్యలు డేంజర్‌ జోన్‌లో ఉండిపోయారట.

ఈ ముగ్గురిలో ఎవరైనా ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని నామినేషన్స్‌ జరిగినప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వారం బాలాదిత్య హౌస్‌మేట్స్‌ కోసం సిగరెట్లు త్యాగం చేశాడు. ఈ అంశం అతడికి బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. చివరగా సుదీప, బాలాదిత్య మిగలగా.. వీరిలో సుదీప ఎలిమినేట్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే పింకీ ఎలిమినేట్‌ అయిందా? లేదా? అనేది తెలియాలంటే నాగార్జున అధికారికంగా ప్రకటించేవరకు నిరీక్షించాల్సిందే!

చదవండి: సిగరెట్లు లేక అల్లాడుతున్న బాలాదిత్య, చలించిపోయిన భార్య
మావాడి వెనకాల ఇనయ తిరుగుతోంది: సూర్య ప్రేయసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement