బిగ్‌బాస్‌: ఏంట్రా షణ్ను, ఇలాగయితే కష్టం కదరా! | Bigg Boss Telugu 5: Netizens Feel Shanmukh Influencing Jessie | Sakshi
Sakshi News home page

Shanmukh: షణ్ముఖ్‌ బిహేవియర్‌పై నెటిజన్ల సెటైర్‌!

Sep 29 2021 6:35 PM | Updated on Sep 29 2021 8:42 PM

Bigg Boss Telugu 5: Netizens Feel Shanmukh Influencing Jessie - Sakshi

ఈ మధ్య షణ్ముఖ్‌ నోటి నుంచి ఒకటే మాట వినిపిస్తోంది.. యాంకర్‌ రవి వల్ల ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతున్నా అని! అలా గేమ్‌ ఆడు, ఇలా గేమ్‌ ఆడు అని ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తే చెడ్డ చిరాకు అని ముఖం చిట్లించుకునే ఇతడు రవి ఏదైనా నోరు తెరిచి చెప్పబోతుంటే చాలు.. వద్దు మహాప్రభో అని మొదటే దండం పెట్టేస్తున్నాడు. తన గేమ్‌ తనను ఆడనివ్వాలని ముఖం మీదే చెప్పేస్తున్నాడు. ఈ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవరూ ఎవరికి సలహాలు ఇవ్వాల్సిన పని లేదని క్లాసులు పీకే అతడు ఈ మధ్య దారి తప్పుతున్నట్లు కనిపిస్తోంది.

ఒకరు చెప్తే వినడం ఇష్టం లేని అతడు కెప్టెన్‌ జెస్సీకి మాత్రం అలా చేయాలి, ఇలా చేయాలంటూ ఆదేశాలిస్తున్నాడు. వీకెండ్‌లో నాగార్జున సైతం ఇదే అభిప్రాయపడ్డాడు. జెస్సీ డమ్మీ కెప్టెన్‌ అని, హౌస్‌లో అసలు కెప్టెన్‌ షణ్ముఖ్‌ అని అందరిముందే సెటైర్‌ వేశాడు. జెస్సీ నోటి వెంట నుంచి వస్తున్న ఆదేశాలన్ని షణ్ముఖ్‌ చెప్పినవే అని కౌంటరిచ్చాడు. ఇక్కడ ప్రేక్షకులకు అర్థం కాని విషయమేంటంటే.. ఒకరి సలహాలను ఇన్‌ఫ్లూయెన్స్‌ అని అభిప్రాయపడే షణ్ను.. జెస్సీకి సూచనలిస్తూ అతడిని ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. జెస్సీకి సొంతంగా ఆడే టాలెంట్‌ ఉందని, అతడికి సంబంధించిన ప్రతి విషయంలో తలదూర్చడం అనవసరమని విమర్శిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement