
'అరేయ్ ఏంట్రా ఇది? కొంచెం కనడబరా.. వన్ వీక్ అయిపోయింది, ఆట మొదలెట్టరా!' అని సెటైర్ వేయడంతో షణ్నూ సిగ్గుతో ముడుచుకుపోయాడు..
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వారిలో ఒకరు హౌస్‌కు వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. ఈ వారం నామినేషన్‌లో యాంకర్ రవి, మానస్, సరయూ, కాజల్, హమీదా, జెస్సీ ఉండగా వీరిలో కొందరిని హోస్ట్ నాగ్ నేడు సేవ్ చేయనున్నాడు. ఎలిమినేట్ అవనున్న కంటెస్టెంట్ పేరును రేపు వెల్లడిస్తాడు. ఇదిలా వుంటే కంటెస్టెంట్లు ఇప్పటివరకు చేసిన తప్పొప్పులను ఎత్తిచూపుతూ అందరి లెక్క సరి చేయనున్నాడు కింగ్ నాగ్. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.
మొదటగా.. ఈ సీజన్‌లో తొలి కెప్టెన్‌గా ఎన్నికైన సిరిని మనస్ఫూర్తిగా అభినందించాడు నాగ్. అనంతరం హౌస్‌లో ఆర్జే అవతారమెత్తి అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా అని కాజల్ మీద చలోక్తి విసిరాడు. బిగ్‌బాస్ షోకి వచ్చీరావడంతోనే తనకు పూలబాణం వేసిన లహరితో మాట్లాడుతూ.. నీ దగ్గరున్న రోజా పువ్వును వచ్చే వారమైనా ఎవరో ఒకరికి ఇస్తావని ఆశిస్తున్నానన్నాడు.
దీంతో లహరి బదులిస్తూ ఎవరినైనా బయట నుంచి పంపించమని దీర్ఘాలు తీయడంతో అక్కడున్న మగాళ్ల పరువు తీసేసినట్లైంది. ఇక కడుపుబ్బా నవ్విస్తున్న లోబో కామెడీకి చప్పట్లు కొట్టిన నాగ్.. షణ్ముఖ్ ఎక్కువగా కెమెరాల్లో కనిపించకపోవడాన్ని ప్రస్తావించాడు. 'అరేయ్ ఏంట్రా ఇది? కొంచెం కనబడరా.. వన్ వీక్ అయిపోయింది, ఆట మొదలెట్టరా!' అని సెటైర్ వేయడంతో షణ్నూ సిగ్గుతో ముడుచుకుపోయాడు. మొత్తానికి నాగ్ ఎంట్రీతో నేటి ఎపిసోడ్‌లో ఎంటర్‌టైన్ మామూలుగా లేదని తెలుస్తోంది. ఈ ఫన్‌ను చూసి ఆస్వాదించాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!