Bigg Boss Telugu 5: Anchor Ravi Takes Highest Remuneration For BB Telugu Show - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన రవి!

Nov 29 2021 1:39 AM | Updated on Dec 1 2021 9:13 PM

Bigg Boss Telugu 5: Anchor Ravi Takes Highest Remuneration For BB Show - Sakshi

అతడిని బిగ్‌బాస్‌ పంపించివేయడానికి భారీ రెమ్యునరేషన్‌ కూడా ఒక కారణమన్న వాదన తెరపైకి వచ్చింది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లలో రవికి అత్యధిక పారితోషికం చెల్లిస్తున్నారట!

Bigg Boss 5 Telugu, Anchor Ravi Remuneraion: బిగ్‌బాస్‌ షో.. ఇక్కడ ఏమైనా జరగొచ్చు. ఊహించిన కంటెస్టెంట్లు సేవ్‌ అవ్వచ్చు.. ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అవనూ వచ్చు. ఎందుకంటే ఇది బిగ్‌బాస్‌. ఎవరి అంచనాలకు అందని రియాలిటీ షో. 12వ వారంలో యాంకర్‌ రవి ఎలిమినేషన్‌ ప్రేక్షక లోకాన్ని షాక్‌కు గురి చేసింది. టాప్‌ 5లో కాదు కాదు.. ఏకంగా టాప్‌ 3లో ఉంటాడనుకున్న అతడు సడన్‌గా ఎలిమినేట్‌ అవడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అంటూ బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్నారు.

కాజల్‌, సిరి, ప్రియాంక కంటే రవికే తక్కువ ఓట్లు వచ్చాయంటే నమ్మలేకపోతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నారు. అతడు బిగ్‌బాస్‌ హౌస్‌లో కొనసాగాలని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అతడిని బిగ్‌బాస్‌ పంపించివేయడానికి భారీ రెమ్యునరేషన్‌ కూడా ఒక కారణమన్న వాదన తెరపైకి వచ్చింది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లలో రవికి అత్యధిక పారితోషికం చెల్లిస్తున్నారట! వారానికి రూ. 7 లక్షల నుంచి 8 లక్షల మధ్యలో ఇస్తున్నారట!

ఈ లెక్కన రవి 12 వారాలకే 90 లక్షల రూపాయలు వెనకేసినట్లు తెలుస్తోంది. ఇది బిగ్‌బాస్‌ విజేతకు అందించే 50 లక్షల ప్రైజ్‌మనీ కన్నా ఎక్కువ కావడం గమనార్హం! బిగ్‌బాస్‌ షో ముగింపుకు వచ్చినందున రవికి అంత మొత్తంలో డబ్బులు వెచ్చించి హౌస్‌లో కొనసాగించడం అవసరం లేదని బిగ్‌బాస్‌ నిర్వాహకులు భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఒక లేడీ కంటెస్టెంట్‌ను ఫినాలేకు పంపించాలని కూడా బలంగా ఫిక్సయినట్లు రవి ఎలిమినేషన్‌తో చెప్పకనే చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement