బిగ్‌బాస్‌ గ్రాండ్ ఫినాలే: స‌్టార్ హీరో ఫిక్స్‌! | Bigg Boss Telugu 4: Grand Finale Guest Chiranjeevi For Second Time | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్ ఫినాలే‌: మ‌రోసారి మెగాస్టారే!

Dec 17 2020 9:27 PM | Updated on Dec 17 2020 9:27 PM

Bigg Boss Telugu 4: Grand Finale Guest Chiranjeevi For Second Time - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ట్రోఫీ కోసం పంతొమ్మిది మంది పోరాడారు. చివ‌రికి ఐదుగురు కంటెస్టెంట్లు మాత్ర‌మే మిగిలారు. హారిక‌, అరియానా, సోహైల్‌, అభిజిత్‌, అఖిల్.. ఎవ‌రికి వారు విజేత‌గా నిల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. మ‌రో మూడు రోజుల్లో గెలుపోట‌ములుఖ‌రారు కానున్నాయి. మ‌రి డిసెంబ‌ర్ 20న అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నున్న‌ గ్రాండ్ ఫినాలేను ఇంత‌కు ముందెన్న‌డూ లేనంత గ్రాండ్‌గా ఏర్పాటు చేసేందుకు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా విజేత‌ను ప్ర‌క‌టించేందుకు స్టార్ హీరోను తీసుకురావ‌డంతో పాటు, అంద‌మైన‌ భామ‌ల‌తో డ్యాన్సులు చేయించ‌నున్నారు. ఇప్ప‌టికే స్పెష‌ల్ గెస్ట్‌ను ర‌ప్పించేందుకు బిగ్‌బాస్ టీమ్ సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. (చ‌ద‌వండి: అభిజిత్ బిగ్‌బాస్‌కే గ‌ర్వ‌కారణం)

రంగంలోకి హీరోయిన్లు
ఈ క్ర‌మంలో మొద‌టి సీజ‌న్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన యంగ్ టైగ‌ర్‌ జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌త్యేక అతిథిగా వ‌చ్చేస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం వెలువ‌డ‌లేదు. అయితే తాజాగా అందుతున్న స‌మ‌చారం ప్ర‌కారం గ‌త సీజ‌న్‌లో గ్రాండ్ ఫినాలేకు వ‌చ్చి రాహుల్ సిప్లిగంజ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించిన మెగాస్టార్ చిరంజీవే మ‌రోసారి రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఆచార్య షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయ‌న ఈ ఆదివారం మాత్రం బిగ్‌బాస్‌కు కేటాయించార‌ట‌. అలాగే ఈ ఫినాలే ఎపిసోడ్‌ను డ్యాన్సుల‌తో హోరెత్తించేందుకు ల‌క్ష్మీరాయ్‌, మెహ‌రీన్ వంటి హీరోయిన్ల‌ను రంగంలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది. వీరికి తోడుగా మరో హీరోయిన్ మోనాల్ ఉండ‌నే ఉంది. అలాగే ఎలిమినేట్ అయిన‌ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు అంద‌రూ క‌లిసి డ్యాన్సుల‌తో సంద‌డి చేయ‌నున్నారు. (చ‌ద‌వండి: మోనాల్ రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే?)

మ‌రోసారి చిరంజీవి
కాగా జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన మొద‌టి సీజ‌న్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు స్పెష‌ల్ గెస్టుల ఎవ‌రూ రాలేదు. ఆయ‌నే శివ‌బాలాజీని విజేత‌గా ప్ర‌క‌టిస్తూ అత‌డికి చెక్కునందించారు. నాని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన రెండో సీజ‌న్‌లో మాత్రం విక్ట‌రీ వెంక‌టేష్ వ‌చ్చి కౌశ‌ల్ మండాకు ట్రోఫీని అందించారు. కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఉన్న‌ మూడో సీజ‌న్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేక అతిథిగా విచ్చేసి రాహుల్ సిప్లిగంజ్‌ను విన్న‌ర్‌గా ప్ర‌క‌టిస్తూ ఆ ఎపిసోడ్‌ను మెగా స‌క్సెస్ చేశారు. నాలుగున్న‌ర గంట‌ల పాటు సాగిన‌ ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు18.29 టీఆర్పీ రాగా మెగాస్టార్ ప్ర‌త్య‌క్ష‌మైన చివ‌రి గంట‌లో మాత్రం 22.4 టీఆర్పీ వ‌చ్చింది. మెగాస్టార్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునే ఆ ల‌క్కీ కంటెస్టెంట్ ఎవ‌రో తెలియాలంటే ఆదివారం వ‌ర‌కు ఎదురు చూడాల్సిందే! (చ‌ద‌వండి: ఆ సెంటిమెంట్ క‌లిసొస్తే అభిజితే విన్న‌ర్‌?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement