అభిజిత్ బిగ్‌బాస్‌కే గ‌ర్వ‌కారణం

Bigg Boss 4 Telugu: Akhil Strongly Believes He Will Be The Winner - Sakshi

'మెచ్యూర్డ్ మ్యాన్ ఆఫ్ ద హౌస్'‌గా అభిజిత్‌

ప్రేమ పాఠాలు, గుణ‌ పాఠాలు, క‌థ‌లు, వ్య‌థ‌లు, పోరాటాలు, ఆరాటాలు, బాధ‌లు, బంధాలు, క‌ల‌యిక‌లు, విడిపోవ‌డాలు, ఆటపాట‌లు, అడ్డంకులు.. ఇలా అన్నీ క‌ల‌గ‌లిపితేనే అది బిగ్‌బాస్ రియాలిటీ షో. తెలుగులో ప్ర‌స్తుతం న‌డుస్తున్న నాల్గ‌వ సీజన్‌కు నాలుగు రోజుల్లో ఎండ్ కార్డ్ ప‌డ‌నుంది. ఈ సంద‌ర్భంగా బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్ల‌ను ఒక్కొక్క‌రిగా పిలుస్తూ వారి వంద రోజుల ప్ర‌యాణాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిస్తున్నారు. నేడు అఖిల్‌, అభిజిత్ వారి ప్ర‌యాణాన్ని త‌రిచి చూసుకుని ఆనందంతో గాల్లో తేలుతున్నారు. మ‌రి ఈ జ‌ర్నీ గురించి వాళ్లేమ‌న్నారో తెలియాలంటే ఇది చ‌దివేయండి..

ప్రేక్ష‌కుల ప్రేమ చాలు..
బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడించిన టాస్కుల‌కు సంబంధించి అన్ని వ‌స్తువుల‌ను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు. ముందుగా అఖిల్‌ను పిలిచి అత‌డి జ‌ర్నీ వీడియో ప్లే చేశారు. ఇందులో మోనాల్‌తో ఆట‌పాట‌లు, అభితో గొడ‌వ‌లు, సోహైల్ త్యాగాలు అన్నీ చూపించడంతో అఖిల్‌ కంట‌త‌డి పెట్టుకున్నాడు. త‌ను ఎఫ‌ర్ట్స్ పెట్టి ఆడాన‌ని  అఖిల్ మ‌రోసారి స్ప‌ష్టం చేశాడు. గెలుపోట‌ములు త‌న‌ చేతిలో లేవ‌ని, కానీ ప్ర‌య‌త్నం మాత్రం ఎప్ప‌టికీ మానుకోలేద‌ని చెప్పాడు. తోడు కోసం ప‌రిత‌పించాను కానీ ప్రేక్ష‌కుల ఓట్ల రూపంలో అంత ప్రేమ వ‌చ్చిన‌ప్పుడు ఇంకా ప్రేమ కావాల‌నుకోవ‌డం ఫూలిష్‌నెస్ అనిపిస్తోంద‌న్నాడు. త‌న‌కీ ప్రేక్ష‌కుల ప్రేమ చాలు అంటూ మోకాళ్ల‌పై మోక‌రిల్లి ఓట్లేసిన వారికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు. బిగ్‌బాస్ వ‌ల్ల‌ తనేంటో త‌న‌కు తెలిసింద‌ని, త‌ప్ప‌కుండా విన్న‌ర్ అవుతానన్న న‌మ్మ‌కం ఉంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశాడు. అనంత‌రం బాల్క‌నీలో ఉన్న త‌న ఫొటోను తీసుకుని ఇంట్లోకి ప్ర‌వేశించాడు. (అభి ఫ్యాన్స్‌ఫై పోలీసుల‌కు మోనాల్ ఫిర్యాదు)

ఇత‌రుల కోసం ఎక్కువ‌గా ఆలోచించావు
అనంత‌రం అభిజిత్ గార్డెన్ ఏరియాలోకి  వెళ్లి త‌న‌కు పేరు తెచ్చిన రోబో టాస్క్‌లోని వ‌స్తువుల‌ను త‌నివితీరా చూసుకున్నాడు. బిగ్‌బాస్ అత‌డికి "మెచ్యూర్డ్ మ్యాన్ ఆఫ్ ద హౌస్" బిరుదునిచ్చాడు. నీ కంటే ఎక్కువ‌గా వేరేవాళ్ల‌కోసం ఆలోచించావ‌‌ని అభిని మెచ్చుకున్నాడు. ఇలాంటి ప‌రిప‌క్వ‌త చెందిన తెలివైన కంటెస్టెంటు హౌస్‌లో ఉన్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో అభి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తూ.. నేను బిగ్‌బాస్‌కు రావ‌డం అనేది నా జీవితంలోనే స‌రైన నిర్ణ‌యం అని భావిస్తున్నాను అని తెలిపాడు. అనంత‌రం అత‌డికి జ‌ర్నీ వీడియో చూపించ‌గా దాన్ని చూసి అభి మైమ‌రిచిపోయాడు. (ఓటింగ్‌లో అభిజిత్‌ను దాటేసిన అరియానా!)

నేనంటే నీకిష్టం లేదా?
ఆ వీడియోలో అభి మోనాల్‌తో పెట్టిన క‌బుర్ల‌నే ఎక్కువ‌గా చూపించారు. అందులో‌ 'నీకు నేనంటే ఇష్టం లేదా?' అని అభి మోనాల్‌ను ప్ర‌శ్నించాడు. అప్పుడు దానికి మోనాల్ స‌మాధానం చెప్ప‌క‌పోయినా త‌ర్వాత మాత్రం 'ఐ లైక్ యూ' అని చెప్పింది. కానీ త‌ర్వాత మారిన ప‌రిస్థితుల వ‌ల్ల‌ ఆమెతో దూరం కావ‌డం, అఖిల్‌తో గొడ‌వ‌లు, నామినేష‌న్లు అన్నింటినీ చూపించారు. హారిక అత‌డికి తోడుగా నిలిచిన సంద‌ర్భాల‌ను సైతం గుర్తు చేశారు. ఇవ‌న్నీ చూసి చ‌లించిపోయిన‌ అభి ఎంతో సంతోషించాడు. త‌ర్వాత‌ త‌న ఫొటోను తీసుకుని లోప‌ల‌కు వెళ్లాడు. రేప‌టి ఎపిసోడ్‌లో మిగ‌తా ముగ్గురి జ‌ర్నీలు చూపించ‌నున్నారు. (ఆ సెంటిమెంట్ క‌లిసొస్తే అభిజితే విన్న‌ర్‌?)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top