Bigg Boss OTT Non Stop: Tejaswi Madivada Entered As 12th Contestant, Deets Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss OTT Telugu: పన్నెండో కంటెస్టెంట్‌గా తేజస్వి మదివాడ

Feb 26 2022 7:55 PM | Updated on Apr 4 2022 4:16 PM

Bigg Boss OTT Non Stop: Tejaswi Madivada Entered As 12th Contestant, Know Her Details - Sakshi

హీరోయిన్‌ తేజస్వి మదివాడ ఎన్నో కష్టాలు పడింది. చిన్నప్పుడే తల్లి క్యాన్సర్‌ బారిన పడి చనిపోగా తండ్రి ఆర్మీ ఆఫీసర్‌ అయినా మద్యానికి బానిసయ్యాడు. దీంతో తినడానికి కూడా తిండి లేక పస్తులున్న రోజులున్నాయి. అలాంటి దీన స్థితి నుంచి హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది తేజస్వి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె హార్ట్‌ ఎటాక్‌, లవర్స్‌, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కేరింత, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌ వంటి పలు సినిమాల్లో నటించింది.

రామ్‌గోపాల్‌ వర్మ ఐస్‌ క్రీం చిత్రంతో హీరోయిన్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో అంతంతమాత్రంగానే అవకాశాలు తెచ్చుకుంటున్న తేజస్వి గతంలో బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో పాల్గొంది. తాజాగా బిగ్‌బాస్‌ ఓటీటీలో అడుగు పెట్టిన ఆమె అభిమానులకు ఎంతో రుణపడి ఉన్నానని, ఎంటర్‌టైన్‌ చేస్తూ ఆ రుణాన్ని తీర్చేసుకుంటానంది. మరి ఈసారైనా ఈ రియాలిటీ షో తేజస్వికి కలిసి వస్తుందా? లేదా? చూడాలి!
 

Advertisement
 
Advertisement
Advertisement