బిగ్‌బాస్‌ మానస్‌ ‘క్షీరసాగర మథనం’కు అమెజాన్‌లో ప్రేక్షకుల బ్రహ్మరథం | Bigg Boss Manas Ksheera Sagara Madhanam Movie Garned 10 Million Views In Amazon Prime | Sakshi
Sakshi News home page

Amazon Prime: బిగ్‌బాస్‌ మానస్‌ ‘క్షీరసాగర మథనం’కు 10 కోట్ల వీక్షణలు

Oct 15 2021 2:34 PM | Updated on Oct 15 2021 2:37 PM

Bigg Boss Manas Ksheera Sagara Madhanam Movie Garned 10 Million Views In Amazon Prime - Sakshi

‘బిగ్ బాస్‌’ఫేమ్ మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘క్షీరసాగర మథనం’. అక్షత సోనావని ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్‌, కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా మూవీని నిర్మించాయి. ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా కరోనా కారణంగా పరిమిత ఆదరణ పొందింది. 

ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్‌ ఫ్రైమ్‌’లో విడుదలై... సంచలనం సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. ఇప్పటికి ఈ చిత్రానికి 10 కోట్ల వీక్షణలు నమోదయ్యాయి. విడుదలైన మూడు నాలుగు రోజులకే టాప్-2లో స్థానం సంపాదించుకున్న ఈ చిత్రం ఇప్పటికీ టాప్ 5లో కొనసాగుతుండడం విశేషం. తమ చిత్రానికి అమెజాన్ ప్రైమ్  ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుండడం ఉక్కిరిబిక్కిరి చేస్తోందని దర్శకుడు అనిల్ పంగులూరి అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement