'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్! | Bigg Boss Latest Promo After Wild Card Entry Contyestants In The House | Sakshi
Sakshi News home page

Bigg Boss: 'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. అడ్డంగా బుక్కైన అవినాశ్!

Oct 7 2024 11:07 AM | Updated on Oct 7 2024 11:30 AM

Bigg Boss Latest Promo After Wild Card Entry Contyestants In The House

బిగ్‌బాస్‌ సీజన్ ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఈ రియాలిటీ షో మొదలై ఇన్ని రోజులవుతున్నా ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఒక్క విష్ణు ప్రియ మినహాయిస్తే అంతా కొత్త వాళ్లే కావడంతో షో చప్పచప్పగా సాగిపోతోంది. అందుకే బిగ్‌బాస్‌ సరికొత్త ఐడియాతో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టేశాడు.

అందులో భాగంగానే గతంలో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్‌గా అలరించిన వారిని ఏరికోరి మరీ సెలెక్ట్ చేసుకున్నారు. వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ఎంట్రీల్లో మాత్రం కొత్తవాళ్లకు చోటివ్వలేదు. బుల్లితెర ఇండస్ట్రీలో బాగా ఫేమ్ ఉన్నవాళ్లనే పట్టుకొచ్చారు. హరితేజ, టేస్టీ తేజ, గంగవ్వ, ముక్కు అవినాష్, గౌతమ్, నయని పావని, మెహబూబ్, రోహిణి లాంటి హౌస్‌లోకి తోసేశారు. ఇక నుంచైనా అభిమానులను ఆకట్టుకునేందుకు బిగ్‌బాస్‌ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.

(ఇది చదవండి: Bigg Boss 8: ఏడో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా ముక్కు అవినాష్‌)

వైల్డ్ కార్డ్ ద్వారా ఎనిమిది మంది హౌస్‌లో అడుగుపెట్టాక మొదటి ప్రోమో విడుదలైంది. ఇందులో గంగవ్వ హౌస్‌లో నవ్వులు పూయించారు. రోహిణి- గంగవ్వ మధ్య ఫన్నీ సంభాషణ నడించింది. ఇక తొలిరోజే ముక్కు అవినాశ్ అడ్డంగా బుక్కయ్యాడు. మొదటి రోజే పాత్రలు క్లీన్‌ చేసే పనికి పూనుకున్నాడు. నేనేదో యుద్ధానికి పోతున్నట్లు అందరూ క్లాప్స్‌ కొడుతున్నారంటూ కామెడీ పండించాడు. ఈ ప్రోమో చూస్తే కొత్త, పాత వాళ్లతో కలిసి బిగ్‌బాస్‌ హౌస్‌ కళకళలాడుతోంది. ఇక నామినేషన్స్ ప్రక్రియ మొదలైతే అసలు కథ స్టార్ట్‌ అవుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement