‘బిగ్‌బాస్‌’ఫేం మానస్‌ మూవీకి యమ క్రేజీ.. నాలుగు భాషల్లో అనువాదం | Bigg Boss Fame Manas Ksheera Sagara Madhanam Movie Goes Dubbing Into 4 Language | Sakshi
Sakshi News home page

‘బిగ్‌బాస్‌’ఫేం మానస్‌ మూవీకి యమ క్రేజీ.. నాలుగు భాషల్లో అనువాదం

Dec 14 2021 2:07 PM | Updated on Dec 14 2021 2:08 PM

Bigg Boss Fame Manas Ksheera Sagara Madhanam Movie Goes Dubbing Into 4 Language - Sakshi

‘బిగ్ బాస్‌’ఫేమ్ మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘క్షీరసాగర మథనం’. అక్షత సోనావని ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్‌, కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా మూవీని నిర్మించాయి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్ర కథానాయకుడు మానస్ నాగులపల్లి బిగ్ బాస్ కి సెలెక్ట్ కావడం, అందులో అత్యద్భుతంగా ఆడుతూ "టాప్-5"కి చేరడం "క్షీరసాగర మథనం" చిత్రానికి బాగా కలిసొచ్చింది. 

  తమ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్  ఆడియన్స్ ఇప్పటికీ విశేషంగా ఆదరిస్తున్నారని, త్వరలోనే ఈ చిత్రాన్ని హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనువాదం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు అనిల్ పంగులూరి తెలిపారు. మానస్ నాగులపల్లి బిగ్ బాస్ విజేతగా నిలవాలని మనసారా కోరుకుంటున్నామని, అందుకు మానస్ అన్నివిధాల అర్హుడని అనిల్ పంగులూరి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement