కొత్త వ్యాపారం మొదలుపెట్టిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. బర్త్‌డే రోజే.. | Bigg Boss Beauty Subhashree Rayaguru Ventures into Real Estate Business | Sakshi
Sakshi News home page

Subhashree Rayaguru: రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లోకి బిగ్‌బాస్‌ సుబ్బు..

Jul 15 2024 5:09 PM | Updated on Jul 15 2024 5:46 PM

Bigg Boss Beauty Subhashree Rayaguru Ventures into Real Estate Business

బిగ్‌బాస్‌ బ్యూటీ శుభశ్రీ రాయగురు గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈరోజు (జూలై 15న) సుబ్బు బర్త్‌డే. ఈ సందర్భంగా తాను రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో అడుగుపెట్టినట్లు తెలిపింది.

సుబ్బు కొత్త బిజినెస్‌
సుభశ్రీ హోమ్స్‌ పేరిట రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ప్రారంభించింది. మీరు కమర్షియల్‌ బిల్డింగ్స్‌, విల్లా, ఇల్లు, ప్లాట్స్‌ కొనాలనుకుంటే సుభశ్రీ హోమ్స్‌ను సంప్రదించడంటూ ఓ వీడియో షేర్‌ చేసింది. ఇది చూసిన బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు, అభిమానులు సుబ్బుకు కంగ్రాట్స్‌ చెప్తున్నారు. మనోభావాలు దెబ్బతిన్నాయితో ఫేమస్‌ అయిన పిల్ల ఇప్పుడు ఇండ్లు అమ్మే బిజినెస్‌లోకి దిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

సినిమాలు, బిగ్‌బాస్‌
బిగ్‌బాస్‌ బ్యూటీ శుభశ్రీ రాయగురుది ఒడిశా. ముంబైలో న్యాయవిద్య అభ్యసించిన ఆమెకు మోడలింగ్‌ అంటే ఇష్టం. 2020లో వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. తర్వాత యాంకర్‌గా, మస్తీజాదే మూవీకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసింది. 2022లో వచ్చిన రుద్రవీణ అనే తెలుగు చిత్రంతో హీరోయిన్‌గా మారింది. అమిగోస్‌, కథ వెనుక కథ.. ఇలా పలు సినిమాల్లో యాక్ట్‌ చేసింది. బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌తో జనాలకు మరింత దగ్గరైంది.

 

 

 

చదవండి: నాలుగేళ్ల క్రితం నివాళి అర్పించా.. దయచేసి ఆమెను అవమానించొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement