బిగ్‌బాస్ షోలో కొన్నాళ్లు ఉన్న తర్వాత ఒక్కొక్కరి చరిత్ర బయటకు వస్తూ ఉంటుంది. కానీ నాగమణికంఠ మాత్రం తన ఏవీ(బిగ్‌బాస్ లాంచింగ్ రోజు వేసిన వీడియో)లోనే కష్టాలన్నీ బయటపెట్టాడు. అలాగే భార్యతో గొడవలు కావడంతో కూతుర్ని సైతం వదిలేసి వచ్చినట్లు పేర్కొన్నాడు. తనకు భార్యాకూతురు కావాలి, అత్తామామ దగ్గర గౌరవం కావాలని బోరున విలపించాడు.
భార్యకు దూరంగా..
మొదట్లో అతడు చెప్పిన మాటల్ని బట్టి తన భార్య విలన్ అని అంతా అనుకున్నారు. కానీ అది నిజం కాదు.. మణికంఠ బిగ్‌బాస్‌కు రావడానికి తనే ఎంకరేజ్ చేసింది. షాపింగ్ కోసం డబ్బులు కూడా ఇచ్చింది. ఈ విషయాల్ని మణి హౌస్‌మేట్స్‌తో చెప్తూ తనను గట్టిగా హగ్ చేసుకోవాలనుందన్నాడు. ఈ క్రమంలో అతడి పెళ్లి వీడియో బయటకు వచ్చింది.
మణి బక్కపలుచన.. భార్య బొద్దుగా
అందులో అతడు వేలు పట్టుకుని ఏడడుగులు వేసిన అమ్మాయి పేరు శ్రీప్రియ అని ఉంది. తను కాస్త బొద్దుగా ఉండటంతో నెటిజన్లు ఆమెపై దారుణంగా సెటైర్లు వేశారు. ఈ అమ్మాయి కోసమా ఇంతలా ఏడ్చావు, కితకితలు సినిమా చూసినట్లుంది.. అని హేళన చేశారు. ఇప్పటికీ ఆమెను బాడీ షేమింగ్ చేస్తూనే ఉన్నారు.
హీనమైన చర్య
ఈ వ్యవహారంపై మణికంఠ సోదరి కావ్య అమర్‌నాథ్ ఫైర్ అయింది. మా అన్నవదినల వీడియో ఒకటి వైరలవుతుండటం నా దృష్టికి కూడా వచ్చింది. ఆ వీడియోకు వచ్చిన నెగెటివ్ కామెంట్లు చూస్తే ఎంతో బాధేసింది. కితకితలు సినిమా రెండో పార్ట్ చూసినట్లుంది అంటూ తన శరీరం గురించి జోకులు వేయడం సరదా కాదు. ఇది హీనమైన చర్య.
తల్లిలా నిలబడింది
మా వదిన సౌందర్యవతి. తన మనసు ఎంతో అందమైనది. ఆమె ప్రేమ, బలం, దయాగుణం.. ఇలాంటి ఎన్నో లక్షణాలు తనను మరింత అందంగా మలిచాయి. నా కోసం ఎప్పుడూ ఒక తల్లిలా నిలబడింది. బాడీ షేమింగ్ చేయడం ఆపేయండి. ప్రతి ఒక్కరూ ఆయా కోణంలో అందంగానే ఉంటారు.
ప్రేమను పంచండి
బరువు తగ్గమని చెప్పడం వల్ల వారికి నష్టమే ఎక్కువ జరగొచ్చేమో! ఆ మాటలు వారి మనసును బాధిస్తాయి. గాయపరుస్తాయి. ఈ నెగెటివిటీని పక్కనపెట్టి ప్రేమను పంచండి. అవతలివారు ఎలా ఉన్నరన్నదానికి బదులుగా ఎలాంటివారో తెలుసుకుని మెచ్చుకోండి అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment