Bigg Boss 6 Telugu Today Latest Promo: Sudheer Babu And Kriti Shetty In Bigg Boss House - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: సత్యను అందరి ముందే తనతో డేట్‌కి రావాలని పిలిచిన రాజ్‌

Sep 16 2022 3:45 PM | Updated on Sep 16 2022 5:01 PM

Bigg Boss 6 Telugu: Sudheer Babu And Kriti Shetty In Bigg Boss House - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీం సందడి చేసింది. సుధీర్‌ బాబు, కృతిశెట్టిలు గ్రాండ్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌తో సరదాగా గడిపారు. ఇక ఇంటిసభ్యులు కొన్ని డైలాగులను స్పూఫ్‌ చేసినట్లు ప్రోమోలో చూపించారు. ఇందులో రేవంత్‌ ఎవడు కొడిడే మైండ్‌ బ్లాంక్‌ అయితుందో వాడే పండుగాడు అంటూ డైలాగ్‌ చెప్పగా, తమిళేంటి, తెలుగేంటి డార్లింగ్‌.. గొడవైంది కొట్టేసుకుందాం రా అంటూ గీతూ తనదైన స్టైల్‌లో డైలాగ్‌ చెప్పి ఆకట్టుకుంది.

ఇక ఆర్జే సూర్య, చలాకీ చంటీల మధ్య జరిగిన డిస్కషన్‌లో సూర్య అతనిపై సరదాగా చేయిచేసుకుంటాడు. మరోవైపు సత్యను ఫ్లర్ట్‌ చేయడానికి రాజ్‌ తెగ ట్రై చేశాడు. శారీలో బాగున్నావ్‌.. లెట్స్‌ గో ఫర్‌ ద డేట్‌ అని అందరి ముందే అడిగేశాడు. దీంతో సత్య ఈ డైలాగ్‌ ఎంతమందికి చెప్పావ్‌ అంటూ అతడి పరువు తీసేసింది. మరి ఇవాల్టి ఎపిసోడ్‌లో ఫన్‌ డోస్‌ ఎంత ఉందన్నది చూడాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement