
రేవంత్‌ను ఇదే ప్రశ్న అడగ్గా.. ఎప్పుడూ నామినేషన్స్‌కు భయపడని ఇనయ నిన్న కొంత భయపడుతున్నట్లు చెప్పిందంటూ ఆమె పేరు చెప్పాడు.
వచ్చే వారమే బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉన్నా సింగిల్ ఎలిమినేషన్‌తో ఒక్కరినే ఎలిమినేట్ చేశారట. మరి ఆ బయటకు వచ్చేసింది ఎవరా? అని ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూశారంటే మీకే అర్థం అయిపోతుంది. ఆమె మరెవరో కాదు ఇనయ సుల్తాన. ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉండే ఇనయ ఎలిమినేట్ కావడమేంటని అందరూ షాకవుతున్నారు.
అయితే నాగార్జున మాత్రం ఇంటిసభ్యుల మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈవారం ఎవరు వెళ్లిపోతారనుకుంటున్నారు? అని ప్రశ్నించాడు. ఇందుకు శ్రీహాన్.. రోహిత్ వెళ్లిపోతాడని అభిప్రాయపడ్డాడు. కీర్తి.. ఆదిరెడ్డి పేరు సూచించింది. రేవంత్‌ను ఇదే ప్రశ్న అడగ్గా.. ఎప్పుడూ నామినేషన్స్‌కు భయపడని ఇనయ నిన్న కొంత భయపడుతున్నట్లు చెప్పిందంటూ ఆమె పేరు చెప్పాడు. దీంతో మధ్యలో అందుకున్న ఇనయ.. నిన్ననే కదా, నేను టాప్ 5లో ఉంటానన్నావు, బయటకు వెళ్లనన్నావు అని నిలదీసింది. దీనిపై నాగ్ మాట్లాడుతూ.. నీకలా చెప్పాడేమో కానీ, తన మనసులో ఉన్న మాట ఇదే అని స్పష్టం చేశాడు.
చదవండి: షాకింగ్ ట్విస్ట్.. ఇనయ ఎలిమినేటెడ్
వరస్ట్ సీజన్.. లేడీ సింగాన్ని పంపించేస్తారా? నెట్టింట ట్రోలింగ్