Inaya Sultana: ఇనయ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్.. హోరెత్తిపోతున్న ట్విటర్

సాధారణంగా ఎలిమినేషన్ సండే జరుగుతుంది. డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు మాత్రమే శనివారం కూడా ఒకర్ని బయటకు పంపించేస్తుంటారు. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనుకుంటే సింగిల్ ఎలిమినేషన్ చాలనుకున్నట్లున్నాడు బిగ్‌బాస్. ఇకపోతే ఇదివరకే షూటింగ్ ముగిసిందని, టాప్ 3 కంటెస్టెంట్ అయిన ఇనయను ఎలిమినేట్ చేశారంటూ ఓవార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది.
ఇదెంతవరకు నిజమో తెలీదు కానీ ఇనయ ఫ్యాన్స్ ఘోరంగా హర్ట్ అయ్యారు. ఒక్క ఇనయ ఫ్యాన్స్ మాత్రమే కాదు బిగ్‌బాస్ వీక్షించే ఎంతోమంది ఫినాలేలో ఉండాల్సిన వ్యక్తిని సడన్‌గా పంపించడమేంటని షాకవుతున్నారు. వేరేవాళ్లను సేవ్ చేయడం కోసం ఇనయను బలి చేశారని ఆగ్రహానికి లోనవుతున్నారు. ఫలితంగా ట్విటర్‌లో ఇనయ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్("INAYA UNFAIR ELIMINATION") ట్రెండ్ అవుతోంది. 33 వేలకుపైగా ట్వీట్లతో ట్విటర్ హోరెత్తిపోతోంది.
'ప్రేక్షకుల ఓట్లంటే లెక్క లేదా? ఇప్పటికే షో ఫ్లాపైంది, ఇంకా ఇనయను పంపించేసి మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నారు', 'చెత్త సీజన్‌కు చెత్త విన్నర్‌ను మీరే సెలక్ట్ చేసుకోండి, మగవాళ్లకు గట్టిపోటీనిచ్చిన లేడీ టైగర్ ఇనయ, అలాంటిది ఆమెను కనీసం ఫినాలేలో కూడా అడుగుపెట్టనీయకుండా ప్లాన్ చేసి పంపించేస్తారా?', రియాలిటీ షోలో కూడా పాలిటిక్సా?' అంటూ నెట్టింట నెటిజన్లు బిగ్‌బాస్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఆమె లేకపోతే ఫినాలేకు టీఆర్పీయే రాదంటూ శాపనార్థాలు పెడుతున్నారు. ఎన్ని వరస్ట్ సీజన్లు వచ్చినా అన్నింటికంటే పరమ వరస్ట్ ఈ సీజనే అని తిట్టిపోస్తున్నారు.
Enni worst seasons vachina, S6 ni beat cheylev!!
History lo nilichipothundhi, UNBEATABLE WORST SEASON!1st nundi kastapadi game adinollantha vellipoyaru, theerigga vacation ki vachinollu migilipoyaru!!
INAYA UNFAIR ELIMINATION
— Nivvi☃️ (@Nivvi011) December 10, 2022
Fighter #inaya got robbed of her winning chance #BiggBossTelugu6 👎
INAYA UNFAIR ELIMINATION https://t.co/eiZFbmagir
— Nish (@bb3telugublr) December 10, 2022
There is no value for audience votes in Telugu Bigboss
INAYA UNFAIR ELIMINATION pic.twitter.com/BPERApPEBy
— vikyath kumar (@vikyath_kumar) December 10, 2022
చదవండి: ఇనయ ఎలిమినేట్
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు
మరిన్ని వీడియోలు