Bigg Boss 6 Telugu: Inaya Says She Has Crush On Surya | Bigg Boss 6 Telugu Episode 32 Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఆ ఒక్క పనితో పడిపోయిన ఇనయా గ్రాఫ్‌.. ఓటింగ్‌లోనూ వెనక్కి

Oct 6 2022 8:57 AM | Updated on Oct 6 2022 9:39 AM

Bigg Boss 6 Telugu: Inaya Says She Has Crush On Surya E32 Highlights - Sakshi

బిగ్‌బాస్‌-6, ఎపిసోడ్‌32 హైలైట్స్‌ : బిగ్‌బాస్‌ ఫైమాకు సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌస్‌మేట్స్‌ నిద్ర లేపాల్సి ఉంటుంది. ఇక ఆమె టాస్క్‌ కంప్లీట్‌ చేద్దాం అనుకున్న టైంలో వసంతి, మెరీనాలు దెయ్యం గెటప్‌లు వేసి ప్రాంక్‌ చేస్తారు. ఈవారం వారిద్దరూ నామినేషన్స్‌లో ఉండటంతో ఎలా అయినా కాస్తైనా కంటెంట్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో దెయ్యం గెటప్‌లు వేసి ఎంటర్‌టైన్‌ చేద్దామనుకున్నారు. కానీ వాళ్లు వేసి దెయ్యం గెటప్‌లకు హౌస్‌లో ఎవరూ భయపడలేదు. దీంతో వాళ్ల కష్టం వృదా అయినట్లే అనిపించింది. ఇక్కడ ఫైమాకు కూడా మైనస్‌ అయ్యింది. ఆమె సీక్రెట్‌ టాస్క్‌ చేద్దామంటే, వీళ్లు వచ్చి టైం వేస్ట్‌ చేసేశారు.

ఆ తర్వాత బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ కోసం చిన్న కేక్‌ పీస్‌ పంపించాడు. దీన్ని ఎవరైనా నలుగురు తినాల్సిందిగా కోరగా, సుదీప తన డామినేటింగ్‌ వాయిస్‌తో ఓటింగ్‌కి వెళ్దామని చెప్తుంది. దీంతో ప్రతిదానికి ఓటింగ్‌ ఏంటంటూ రేవంత్‌ చాలా అసహనం వ్యక్తం చేశారు. వీళ్లు ఇలా తేల్చుకునేలోపే ఆ కేక్‌ను స్టోర్‌ రూమ్‌లో పెట్టమని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా రేవంత్‌, శ్రీహాన్‌లు వేసిన లేడీ గెటప్‌లు ఎంటన్‌టైనింగ్‌గా అనిపించాయి. ఆ తర్వాత చంటి, శ్రీహాన్‌లకు కాళ్లు వ్యాక్స్‌ చేయించుకోవాల్సిందిగా బిగ్‌బాస్‌ ఆదేశించగా, శ్రీహాన్‌ అక్కడ కామెడీ చేస్తాడు.

ఇదిలా ఉండగా కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లిన ఇనయాను ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా చెప్పాలంటూ బిగ్‌బాస్‌ ఆదేశించగా, తనకు సూర్య అంటే క్రష్‌ అని, అతనిపై రోజురోజుకు ఇష్టం పెరుగుతుందని చెప్తుంది. అంతేకాకుండా ఆరోహితో సూర్య క్లోజ్‌గా ఉంటే తనకు జలసీగా అనిపిస్తుందని చెప్తుంది. ఇప్పటికే ఆరోహి-సూర్యలపై బయట నెగిటివ్‌గానే ఉంది. ఇనయా కూడా సూర్య అంటే ఇష్టం అని చెప్పడం, అతనికి హగ్గులు ఇస్తూ క్లోజ్‌గా ఉండటం ఆమె గ్రాఫ్‌ను తగ్గించింది. ఓటింగ్‌లోనూ మునుపటి కంటే వెనుకపడిపోయింది. మరి రానున్న రోజుల్లో ఈ ట్రయాంగిల్‌ ఆమె ఆటతీరును మార్చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement