నా ముందు నువ్వు నథింగ్‌: గీతూపై రేవంత్‌ ఫైర్‌ | Bigg Boss 6 Telugu: Fight Between Singer Revanth, Geetu Royal | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: నువ్వు గొప్ప కాదు, నా ముందు నథింగ్‌

Oct 24 2022 7:27 PM | Updated on Oct 24 2022 10:53 PM

Bigg Boss 6 Telugu: Fight Between Singer Revanth, Geetu Royal - Sakshi

ఫస్ట్‌ వీక్‌ నుంచి రూల్స్‌ పాటించనిది నువ్వేనని గీతూ.. నువ్వు గొప్ప అని ఫీలవుతున్నావు, తగ్గించుకో, నా ముందు నువ్వు నథింగ్‌ అని రేవంత్‌

వారమంతా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా సరే నామినేషన్స్‌ వచ్చేసరికి దోస్తానా పక్కన పెట్టేస్తుంటారు హౌస్‌మేట్స్‌. సరైన కారణం ఉందంటే చాలు నామినేషన్‌లో ఓట్లతో గుద్దిపడేస్తుంటారు. మొన్నటివరకూ నువ్వూ నేను జంట.. టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌ అంట.. అని డ్యూయెట్‌ సాంగ్‌ పాడుకున్న ఇనయ, సూర్య.. ఇప్పుడు మాత్రం కొట్లాటకు దిగారు.

తాజా ప్రోమోలో గీతూ, రేవంత్‌కు మధ్య మాటల యుద్ధం జరిగినట్లు కనిపిస్తోంది. ఫస్ట్‌ వీక్‌ నుంచి రూల్స్‌ పాటించనిది నువ్వేనని గీతూ.. నువ్వు గొప్ప అని ఫీలవుతున్నావు, తగ్గించుకో, నా ముందు నువ్వు నథింగ్‌ అని రేవంత్‌ పోట్లాడుకున్నారు. చాలామంది మెరీనా గేమ్‌ కనిపించట్లేదని ఆమెను నామినేట్‌ చేసినట్లు కనిపిస్తోంది. మొదటి నుంచీ అందరూ నన్ను నామినేట్‌ చేస్తున్నారని నువ్వూ చేస్తున్నావ్‌ తప్ప నీకు పెద్దగా ఏ రీజన్‌ లేదని కీర్తిపై ఫైర్‌ అయ్యాడు రేవంత్‌. మరి ఈ పోట్లాటలు, కొట్లాటలు చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!

చదవండి: అరుంధతిలో బాలనటి, ఇప్పుడెలా ఉందంటే?

Advertisement
 
Advertisement
Advertisement