Bigg Boss 6: చంటికి షాకిచ్చిన బిగ్‌బాస్‌.. కెప్టెన్సీ రేసు నుంచి ఔట్‌

Bigg Boss 6 Telugu: Chanti Failed In Secret Task,Episode 25 Highlights - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో హోటల్‌ టాస్క్‌ నడుస్తోంది. బీబీ హోటల్‌ స్టాఫ్‌గా సుదీప, బాలాదిత్య, మెరీనా, గీతూ, రేవంత్‌, చంటి ఉంటే.. గ్లామ్‌ ప్యారడైజ్‌ హోటల్‌ స్టాఫ్‌గా వాసంతి, ఫైమా, కీర్తి, శ్రీసత్య, ఆరోహి ఉన్నారు. ఇక గెస్టులుగా శ్రీహాన్‌, ఇనయా, ఆదిరెడ్డి, రాజ్‌, అర్జున్‌ ఉన్నారు.  బీబీ హోటల్‌ మేనేజర్‌ సుదీప వచ్చి.. గెస్టులు వాష్‌ రూమ్‌కి వెళ్లాలి అనుకుంటే..  ప్రతి ఒక్కరు రూ.500 ఇవ్వాలని కండీషన్‌ పెట్టింది.

అయితే దీనికి ఆదిరెడ్డి ఓకే చెప్పగా.. సూర్య, రాజ్‌ మాత్రం మేం అల్రెడీ డీల్‌ మాట్లాడుకున్నాం. మాకు అవసరం లేదని చెప్పారు. మీకు ఏదైనా ఉంటే.. రెండు హోటళ్ల మేనేజర్లు కలిసి మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో సుదీప వెళ్లి గ్లామ్‌ ప్యారడైజ్‌ హోటల్‌ మేనేజర్‌ ఫైమాతో మట్లాడింది. అయితే అక్కడ డీల్‌ పెట్టుకున్న ఫైమానే తొలుత ఎవరు ఎవరితో డీల్‌ పెట్టుకున్నారో తెలియదని దాటవేసే ప్రయత్నం చేసింది. చివరకు వాళ్ల టీమ్‌ వాళ్లతో చర్చించి.. డీల్‌ మాట్లాడుకోవడం తప్పేనని.. ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశామని చెప్పారు.

ఇక మతిమరుపు క్యారెక్టర్‌లో ఉన్న సూర్యతో.. ‘నేను నీ ప్రేయసిని.. మర్చిపోయావా’అంటూ ఇనయా తనలో నిద్రపోయిన నటనను లేపింది. ఇక్కడ ఇద్దరూ ఆస్కార్‌ లెవల్‌ ఫెర్ఫామెన్స్‌ ఇచ్చారు.  ‘సూర్యా మనం ఇక్కడే కూర్చున్నాం.. ఇక్కడే పడుకున్నాం.. బేబీ నువ్వంటే నాకు చాలా ఇష్టం.. ఇన్ని రోజులు మన మధ్య జరిగినవి అన్నీ మర్చిపోయావా? నిజంగానే నాకు నువ్ అంటే నాకు చాలా ఇష్టం.. నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నా.. నువ్ నన్ను మర్చిపోతే నేను ఎలా బతకాలి’ అని ఇనయ అంటే.. ‘నిజంగా మనం ప్రేమించుకున్నామా? మనషులు అర్ధం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు.. అగ్నిలా స్వచ్ఛమైనది అని భారీ డైలాగ్‌తో సూర్య చెలరేగిపోయాడు. 

ఇక వాష్‌ రూం దగ్గర కాపలాగా ఉన్న రేవంత్‌ దగ్గరకు ఆదిరెడ్డి వెళ్లి.. వాష్‌రూం వెళ్తానని అడుగుతాడు. అప్పుడు రేవంత్‌ ‘ లేదు బ్రో మా వాళ్లు మీటింగ్ పెట్టారు.. వాళ్లు చెప్పినట్టు చేయాలి.. ఇక్కడ నాకు వచ్చేది రూపాయి లేదు.. ఎవరికి వాళ్లు వాళ్ల ఫేవరేట్ పీపుల్‌ని కాపాడుకుంటున్నారు కాబట్టి.. ఇది ఎలాగూ తేలదు వాళ్లు చెప్పింది చేస్తే.. కనీసం వందో రెండొందలో వస్తుందని’ అన్నాడు ఇంతలో రోహిత్ వచ్చి.. రేవంత్‌ని చూసి నవ్వుతాడు. ఆది రెడ్డి కూడా గట్టిగా నవ్వడంతో.. ‘నవ్వండి బ్రో.. ఎవరెంత నవ్వుతారో నవ్వండి.. రేపటి రోజున బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్‌ని నేను ఇలా పట్టుకున్నప్పుడు మీ నవ్వులు ఏమౌతాయో చూస్తాను’ అని అన్నాడు రేవంత్.

ఇక బిగ్‌బాస్‌ ఇరు హోటళ్ల సభ్యులను పిలిచి..ఎవరి దగ్గరు ఎంత డబ్బు ఉందో చెప్పమని అడిగాడు. దీంతో బీబీ హోటల్‌ దగ్గరు రూ.4600 ఉంటే.. గ్లామ్‌ ప్యారడైజ్‌ దగ్గరు 5300 ఉన్నాయని చెప్పారు. ఎక్కువ డబ్బులు ఉన్న గ్లామ్‌ ప్యారడైజ్‌ సభ్యుల ఆదిపత్యంలోకి బీబీ హోటల్‌ కూడా వస్తుందని బిగ్‌బాస్‌ చెప్పాడు. అంతేకాదు బీబీ స్టాఫ్‌ నుంచి ముగ్గురు సభ్యులను మాత్రమే తమ టీమ్‌లోకి తీసుకోవాలని.. మిగిలిన వారిని ఉద్యోగంలో నుంచి తీసేసి.. పోటీదారుల నుంచి తొలగించొచ్చని చెప్పాడు. దీంతో రేవంత్‌, ఆదిత్యలను తొలగించి.. సుదీప, గీతూ, మెరీనాలను తమ టీమ్‌లోకి తీసుకున్నారు. ఇక సీక్రెట్‌ టాస్క్‌లో విఫలమయ్యాడని చెబతూ.. చంటీని కెప్టెన్సీ పోటీదారుల రేసు నుంచి తొలగించాడు బిగ్‌బాస్‌. దీంతో రేవంత్‌,ఆదిత్యలతో పాటు చంటీ కూడా కెప్టెన్‌ అయ్యే చాన్స్‌ని మిస్‌ అయ్యాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

28-09-2022
Sep 28, 2022, 13:25 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో నామినేషన్స్‌ ప్రక్రియ పూర్తికాగానే కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక ప్రక్రియను మొదలు పెడతాడు బిగ్‌బాస్‌. దీని కోసం హౌస్‌మేట్స్‌కు...
27-09-2022
Sep 27, 2022, 15:38 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6లో నామినేషన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటిదాకా ఫ్రెండ్స్‌ అనుకున్నవాళ్లు కూడా సిల్లీ రీజన్‌ చెప్పి నామినేట్‌ చేస్తుంటారు....
27-09-2022
Sep 27, 2022, 10:17 IST
BiggBoss 6, Episode 23  :  బిగ్‌బాస్‌ సీజన్‌-6 మూడోవారం పూర్తిచేసుకొని నాలుగోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక నామినేషన్స్‌ ప్రక్రియ మాత్రం ఈసారి...
26-09-2022
Sep 26, 2022, 13:59 IST
బిగ్‌బాస్‌ నాలుగోవారం నామినేషన్స్‌ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా ఇద్దరు సభ్యుల తలపై ఒక్కో టమాటాను పూర్తిగా స్మాష్‌ చేసి...
26-09-2022
Sep 26, 2022, 12:55 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ అనుకున్న నేహా చౌదరి ఎలిమినేట్‌ అయ్యింది.ఇనయా, వాసంతిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్‌ అవుతారని అంతా...
25-09-2022
Sep 25, 2022, 23:01 IST
బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి మూడోవారం నేహా ఎలిమినేట్‌ అయింది. నమ్మినవాళ్లే మోసం చేశారంటూ ఏడుస్తూ బయటకు వచ్చింది. స్టేజ్‌ మీద...
25-09-2022
Sep 25, 2022, 12:42 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారం ఆటలు, పాటలు కామన్‌. నాగార్జన వచ్చి కంటెస్టెంట్స్‌తో చిన్న చిన్న గేమ్స్‌ ఆడించి, చివరకు ఒకరిని...
25-09-2022
Sep 25, 2022, 11:22 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం గలాట గీతూ హవా నడుస్తోంది. మూడు వారాలుగా గీతూ ఆట తీరుపై నాగార్జున ప్రశంసలు కురిపిస్తూనే...
25-09-2022
Sep 25, 2022, 10:51 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 రసవత్తరంగా ముందుకు సాగుతుంది. తొలి రెండు వారాలు చప్పగా సాగిన ఈ షో.. మూడో వారంలో వచ్చేసరికి...
24-09-2022
Sep 24, 2022, 23:33 IST
బిగ్‌బాస్‌ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. తెరపైకి ఎప్పుడు ఎలాంటి రూల్‌ వస్తుందో ఊహించడం కష్టమే. ముఖ్యంగా...
24-09-2022
Sep 24, 2022, 13:38 IST
బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ విజయవంతంగా రన్‌ అవుతోంది. తొలి రెండు వారాలు చప్పగా సాగిన...
24-09-2022
Sep 24, 2022, 10:12 IST
బిగ్‌బాస్‌ కొత్త కెప్టెన​్‌గా ఆదిరెడ్డి విజేతగా నిలుస్తాడు. ఇక అందరికంటే ఎక్కువగా కంటెంట్‌ ఇస్తున్నది తానే అంటూ గీతూ తన...
23-09-2022
Sep 23, 2022, 10:41 IST
కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ ముగుస్తుంది. పోలీస్‌ టీం ఇందులో విజేతగా నిలుస్తుంది. శ్రీహాన్‌-ఇనయాల మధ్య మాటల యుద్దం జరగడానికి గల...
22-09-2022
Sep 22, 2022, 13:36 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట టాస్క్‌ చివరి దశకు చేరుకుంది. ఈ టాస్కులో చివరిరోజు...
22-09-2022
Sep 22, 2022, 09:24 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ జరుగుతోంది. ‘అడవిలో ఆట’ పేరిట జరుగుతున్న ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు...
21-09-2022
Sep 21, 2022, 15:15 IST
బిగ్‌బాస్‌ -6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం అడవిలో ఆట గేమ్‌ కొనసాగుతుంది. ఇందులో పోలీసులు, దొంగలుగా రెండు టీమ్స్‌గా విడిపోయారు. అయితే...
21-09-2022
Sep 21, 2022, 12:43 IST
సత్యను తాను మోసం చేయలేదని, అలాంటి ఉద్దేశమే ఉంటే తనతో నిశ్చితార్థం, పెళ్లి వరకు ఎందుకు వస్తానంటూ పవన్‌ రెడ్డి...
21-09-2022
Sep 21, 2022, 10:50 IST
కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట అనే టాస్కులో ఇనాయాకు శ్రీహాన్‌, రేవంత్‌లతో గొడవ అవుతుంది. మరోవైపు రూల్స్‌...
20-09-2022
Sep 20, 2022, 15:15 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6లో ఈవారం కెప్టెన్సీ పోటీదారుల కోసం అడవిలో ఆట అనే టాస్క్‌ని నిర్వహించాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా కొంతమంది...
20-09-2022
Sep 20, 2022, 10:13 IST
బిగ్‌బాస్‌లో సోమవారం నామినేషన్స్‌ రచ్చ ఓ రేంజ్‌లో జరిగింది. శ్రీహాన్‌ తప్పా మిగతా ఇంటిసభ్యులంతా ఒకరిపై ఒకరు గట్టిగానే కౌంటర్‌...

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top