బిగ్‌బాస్‌ 5: నామినేషన్‌ లొల్లి, ఏడ్చేసిన జెస్సీ | Bigg Boss 5 Telugu Latest Promo: First Week Nominations Started | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: మొదటి రోజే కొట్లాట మొదలైందిగా!

Sep 6 2021 6:07 PM | Updated on Sep 6 2021 6:34 PM

Bigg Boss 5 Telugu Latest Promo: First Week Nominations Started - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ గ్రాండ్‌గా మొదలైంది. 19 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్‌ హౌస్‌ కళకళలాడిపోతోంది. వీళ్లు హౌస్‌లోకి అడుగుపెట్టారో లేదో అప్పుడే ఎలిమినేషన్‌ కోసం నామినేషన్‌ ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక ప్రోమో కూడా రిలీజైంది. ఇందులో కంటెస్టెంట్లు అందరూ తాము నామినేట్‌ చేయాలనుకునే వ్యక్తి ఫేస్‌ ఉన్న బ్యాగును చెత్తడబ్బాలో వేస్తున్నారు. కొందరు దీన్ని పాజిటివ్‌గా తీసుకుంటుంటే మరికొందరు మాత్రం ఎదురుతిరుగుతున్నారు. ఈ క్రమంలో లోబో రవిని నామినేట్‌ చేస్తూ నీ యాటిట్యూడ్‌ నీ దగ్గర పెట్టుకో అని కాస్త స్ట్రాంగ్‌గానే వార్నింగ్‌ ఇచ్చాడు.

మరోవైపు రవి తనవంతు రాగానే నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేసినట్లు కనిపిస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే స్ట్రిక్ట్‌గా అనిపిస్తోందని రవి చెప్పగా... తనకు నటించడం రాదని కౌంటరిచ్చాడు మాస్టర్‌. ఇక విశ్వ, జెస్సీల మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నటరాజ్‌ మాస్టర్‌ మాట్లాడుతూ.. ఇక్కడ అమాయకత్వం ఉంటే తొక్కేస్తారు అంటూ జెస్సీని నామినేట్‌ చేశాడు. దీంతో జెస్సీ కంటతడి పెట్టుకున్నాడు. మరి ఈ వారం ఎవరెవరు నామినేట్‌ అయ్యారు? అనేది తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement