Bigg Boss Telugu 5: జెస్సీకి తిరగబెట్టిన రోగం, కొత్త లక్షణాలతో సతమతం!

Bigg Boss 5 Telugu: Jessie Suffering With New Symptoms Of Vertigo - Sakshi

Bigg Boss 5 Telugu, Episode 68: బిగ్‌బాస్‌ షోలో బీబీ హోటల్‌ టాస్క్‌ నడుస్తోంది. ఇందులో హోటల్‌కు విచ్చేసిన అతిథులు సన్నీ, సిరి, కాజల్‌, ప్రియాంక, మానస్‌.. అక్కడి సిబ్బందితో సపర్యలు చేయించుకుంటూ టిప్పులివ్వకుండా విసిగించారు. వీరి ప్రవర్తనతో చిర్రెత్తిపోయిన హోటల్‌ స్టాఫ్‌ ముందు పైసలు తీయండి, కావాల్సినంత సేవలు చేయించుకోండి అని అభ్యర్థించినప్పటికీ వారు వినిపించుకోలేదు.

రవికి సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చారని తెలిసిపోయింది!
చేసేదేం లేక సిబ్బంది అతిథుల సేవల్లో తరించారు. హనీమూన్‌ కపుల్‌ ప్రియాంక- మానస్‌ల కోసం యానీ మాస్టర్‌ పూలతో బెడ్‌ అలంకరించింది. మీ శోభనం కోసం అన్నీ సిద్ధం చేశానని చెప్తుండగా సన్నీ వెళ్లి ఆ బెడ్‌మీద పడి దొర్లి దాన్ని నాశనం చేశాడు. మరోపక్క షణ్ముఖ్‌.. నువ్వు దొంగతనం చేశావన్న విషయం తనకు తెలుసంటూ రవితో నేరుగా చెప్పాడు. అడ్డంగా దొరికిపోయినప్పటికీ రవి మాత్రం తాను తీయలేదని బుకాయించాడు. టాస్క్‌ చెడగొట్టే పనిలో భాగంగా కాజల్‌ వాటర్‌ బాటిల్‌లో కారం పోశాడు. అయితే హౌస్‌మేట్స్‌ ఇది చేసింది రవే అని పసిగట్టారు. అతడికి సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చారని, ఇక నుంచి రవికి డబ్బులు ఇవ్వకూడదని ఓ నిర్ణయానికి వచ్చారు.

డబ్బులివ్వడం లేదని ఏడ్చేసిన యానీ
మరోపక్క సన్నీ.. పింకీ-మానస్‌ల క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ను సర్వనాశనం చేశాడు. దీంతో అలకమంచం ఎక్కిన పింకీని బుజ్జగించి కూల్‌ చేశాడు మానస్‌. ఇదిలా వుంటే తన డబ్బులు కొట్టేశారన్న బాధలో ఉన్న కాజల్‌ ఎలాగైనా వాటిని సంపాదించుకోవాలనుకుంది. ఇందుకోసం యానీ బ్యాగులో నుంచి డబ్బులు దొంగిలించింది. కానీ హౌస్‌మేట్స్‌ మాత్రం ఇది కచ్చితంగా రవి పనే అయ్యుంటుందని అతడి మీద అనుమానం వ్యక్తం చేశారు. బండెడు పనులు చేయించుకుని చారానా వంతు టిప్పు ఇస్తున్నారని అసహనానికి లోనైన యానీ ఇన్ని పనులు చేయిస్తున్నారు.. నేను మనిషినా? పశువునా? అని ఆవేశపడింది. కుక్కల్లా పనులు చేయిస్తున్నారు, కానీ డబ్బులు ఇవ్వరు అంటూ ఏడ్చేసింది.

జెస్సీకి తిరగబెట్టిన రోగం
ఇలాగైతే తమకు డబ్బులు రావని అర్థమైన సిబ్బంది మాకు 10 వేల రూపాయలు ఇచ్చేవరకు అతిథులెవరికీ ఫుడ్‌ పెట్టమని తేల్చి చెప్పారు. దీంతో అతిథులు ఓ మెట్టు దిగి వచ్చి డబ్బులు ఇచ్చి ఆహారం అందుకున్నారు. ఇక సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న జెస్సీ తను సరిగా చూడలేకపోతున్నానని, ఒక వైపుకు నెట్టేసినట్లు పడిపోతున్నానని బిగ్‌బాస్‌కు చెప్పుకున్నాడు. పడుకున్నప్పుడు స్నేక్‌ ఉన్నట్లుగా అనిపిస్తుందన్నాడు. దీంతో అతడిని చెకప్‌ చేసేందుకు డాక్టర్‌ రాగా.. జెస్సీ తన చేతులు లావైనట్లు అనిపిస్తోందని ఇలా ఇంతకుముందెన్నడూ అనిపించలేదని తెలిపాడు. నీకు మెరుగైన వైద్యం అవరసరమన్న డాక్టర్‌, అందుకు తగ్గట్టు మంచి ట్రీట్‌మెంట్‌ ఇస్తామని, ధైర్యంగా ఉండమని జెస్సీకి భరోసా ఇచ్చాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top