Bigg Boss 5 Telugu: నిక్కరు తప్ప అన్ని విప్పేసిన విశ్వ.. అది కూడా..అంటూ ప్రియ కామెడీ

Bigg Boss 5 Telugu: Big War Between Priya And VJ Sunny - Sakshi

Bigg Boss Telugu 5, Episode 46: కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా విశ్వకు స్పెషల్‌ పవర్‌ ఉన్న ఒక ఎల్లో గుడ్డు లభించింది. దాని ద్వారా ఐదు గుడ్లను పొందే అవకాశం లభించింది. అయితే దాని కోసం ఎక్కువ దుస్తులు ధరించాలనే ఒక టాస్క్‌ను కూడా ఇచ్చాడు బిగ్‌బాస్‌. విశ్వతో పాటు ఆయన ఎంచుకున్న మరో వ్యక్తి ఈ టాస్క్‌ ఆడాల్సి ఉంటుంది.

దీంతో కాజల్‌ని తన పోటీదారునిగా ఎంచుకున్నాడు విశ్వ. ఇద్దరు పోటా పోటీన దుస్తులు ధరించారు. ఈ టాస్క్‌లో సన్నీ.. కాజల్‌కి హెల్ప్ చేశాడు. ఆమె చేతఎక్కువ దుస్తులు ధరింపజేయాలని ఇంటి సభ్యుల లోదుస్తులతో సహా అన్ని పట్టుకొచ్చాడు. అవి చూసి ప్రియాంక ‘ఛీ’అంటూ తెగ నవ్వేసింది. ఈ టాస్క్‌లో మొత్తంగా విశ్వ 106 దుస్తులు ధరించి కాజల్‌(79 దుస్తులు)పై గెలిచాడు. దుస్తులు తొలగించే క్రమంలో విశ్వ తన ఒంటి పై ఉన్న నిక్కరు తప్ప అన్ని విప్పేశాడు. దీంతో ప్రియాంక ‘అది కూడా తీసేయ్‌’అని అనడంతో ఇంటి సభ్యులంతా నవ్వేశారు.
 
జస్వంత్‌కి సీక్రెట్ టాస్క్
‘బంగారు కోడిపెట్ట’ టాస్క్‌లో భాగంగా  జెస్సీకి బిగ్‌బాస్‌ ఓ సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. హౌస్‌లో ఎవరైనా ముగ్గురు సభ్యులు సభ్యుల దగ్గర గుడ్లు లేకుండా నాశనం చేయాల్సి ఉంటుందని, ఈ సీక్రెట్‌ టాస్క్‌లో గెలిస్తే నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికవుతారని చెప్పాడు.  ఈ టాస్క్‌లో సహాయకులుగా ఒకర్ని ఎంచుకోవచ్చని బిగ్ బాస్ చాయిస్‌ ఇచ్చాడు. దీంతో సిరి సహాయం తీసుకున్నాడు జెస్సీ. వీరిద్దరు కలిసి.. షణ్ముఖ్‌, ప్రియ, ప్రియాంక దగ్గర ఎగ్స్‌ లేకుండా చేయాలని డిసైడ్‌ అయ్యారు. షణ్ణ్నూ దగ్గరకు వెళ్లిన సిరి..  అతని దగ్గర ఉన్న ఎగ్స్‌ని ఇచ్చేయడానికి ఒప్పించింది. ఆ తరువాత ప్రియాంక దగ్గరకు వెళ్లి నాపై నమ్మకం పెట్టుకుని నీ దగ్గర ఎక్స్ ఏమీ పెట్టుకోకు.. తరువాత నువ్వే హ్యాపీ ఫీల్ అవుతావు అని చెప్పింది. దీంతో ప్రియాంక కూడా ఎగ్స్‌ లేకుండా చూసుకుంటానని మాట ఇచ్చింది. ఆ తర్వాత ప్రియను కూడా ఒప్పించారు. 

జెస్సీ గుడ్లు నొక్కేసిన సన్నీ
అందరూ పడుకున్న తరువాత సన్నీ గుడ్లు నొక్కేయడం మొదలుపెట్టాడు. జెస్సీ దాచుకున్న గుడ్లను కొట్టేసి మానస్‌కి ఇచ్చాడు. అయితే ఇది కామెడీగానే చేశాడు సన్నీ. కానీ అదే వారిద్దరి మధ్య గొడవకు దారి తీసింది. సన్నీ గుడ్లు తీసిన విషయాన్ని ప్రియ పసిగట్టి సిరికి చెప్పింది. ఈ విషయంపై జెస్సీ, సన్నీల మధ్య మాటల యుద్దం జరిగింది.

చెప్ప పగిలిపోద్దన్న ప్రియ.. దమ్ముంటే కొట్టమన్న సన్నీ
‘బంగారు కోడిపెట్ట’టాస్క్‌లో భాగంగా సన్నీ ఒక్కో గుడ్డును ఏరుకొని తన బుట్ట దాచుకుంటే.. వాటిని నొక్కేసే ప్రయత్నం చేసింది ప్రియ. ఈ క్రమంలో సన్నీ, ప్రియల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒకానొక దశలో ఫిజికల్‌ అటాక్‌ వరకు వెళ్లింది. బుట్టలోని గుడ్లను దొంగిలించడానికి ప్రియ ప్రయత్నించగా..  ప్లీజ్ ప్రొటక్షన్ అంటూ ఆమెను పక్కకి తోసేశాడు సన్నీ. దీంతో కోపోద్రిక్తురాలైన ప్రియ.. అతనిపై పూల కుండీ ఎత్తేసి.. ఫిజికల్ ఎటాక్ చేస్తే మరద్యాదగా ఉండదు..  చెంప పగిలిపోద్ది అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. దానికి సన్నీ నోరు ఉందికదా అని పారేసుకోవద్దు అంటూ సీరియస్ అయ్యాడు. మిగిలిన  ఇంటి సభ్యులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికి గొడవ తగ్గలేదు. ప్రియ మరింత రెచ్చిపోయి.. నా  మీదికి వస్తే చెంపపగిలిపోద్ది అని పదే పదే అనడంతో.. దమ్ముంటే కొట్టు అని సన్నీ మీది మీదికి వెళ్లాడు. ఇంటి సభ్యులు కలగజేసుకొని వారిద్దరిని శాంతింపజేశారు

ప్రియ.. కాజల్‌ వెకిలి నవ్వులు
సన్నీని టార్గెట్‌ చేసిన ప్రియ.. చేసిందంతా చేసి.. మళ్లీ తనపై ఫిజికల్‌ అటాక్‌ చేశాడంటూ ఎడ్వడం మొదలెట్టింది. అంతేకాదు ఆడు ఈడు అని మాట్లాడలేదని, ఒకవేళ తనకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే అలా కూడా అంటానని తనను తాను సమర్థించుకుంది. చేసేదంతా చేసేసి ఈ సింపథీ డ్రామాలేంటి? అని సన్నీ మిగతా సభ్యులతో అన్నాడు. ఇక కాజల్‌ మధ్యలో కలగజేసుకొని మా బుట్టలనే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారని అడగ్గా.. మిమ్మల్నే టార్గెట్‌ చేస్తానని ప్రియ ముఖం మీదే చెప్పేసింది. దీంతో కాజల్‌ వెతకారంగా నవ్వగా.. ప్రియ కూడా అలానే నవ్వేసింది.వీరిద్దరి వెకిలి నవ్వులు చూసిన యానీ మాస్టర్‌ నవ్వును ఆపుకోలేకపోయింది.

సిరితో రవి డీల్‌
బంగారు కోడిపెట్ట టాస్క్‌లో తొలిరోజే సిరి స్టిక్కర్స్‌ని కోల్పోయిన విషయం తెలిసిందే కదా. అయితే  సిక్టర్స్‌ ఇస్తే.. గుడ్లు ఇస్తావా అని డీల్‌ కుదుర్చుకున్నాడు. నాలుగు గుడ్లు ఇచ్చింది.

శ్రీరామ్‌కు స్పెషల్‌ బ్లూ ఎగ్‌.. బట్‌ నో యూజ్‌
టాస్క్‌లో భాగంగా శ్రీరామ్‌కు  స్పెషల్‌ బ్లూ ఎగ్‌ లభించింది. దీని ద్వారా ఐదు గుడ్లను పొందే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అందుకోసం ఒకరిని ఎంచుకొని ఆ వ్యక్తితో గేమ్‌ ఆడాల్సి ఉంటుంది. దీంతో శ్రీరామ్‌ తెలివిగా తనకంటే పొట్టిగా ఉన్న యానీ మాస్టర్‌ని ఎంచుకున్నాడు. దీంట్లో భాగంగా ఇద్దరి సభ్యులకు ప్రభాకర్‌, దివాకర్‌ అనే బాతు బొమ్మలను ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఆ బొమ్మను చేతుల్లో పట్టుకొని.. కింద పడిపోకుండా ఎవరు కాపాడుకుంటారో వారికే ఐదు గుడ్లు లభిస్తాయి. ఈ గేమ్‌లో యానీ మాస్టర్‌ గెలిచి, ఐదు గుడ్లను స్వంతం చేసుకుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top