బిగ్‌బాస్‌: మామ స్థానంలో కోడ‌లు సామ్‌?

Bigg Boss 4 Telugu: Samantha Akkineni May Host Bigg Boss - Sakshi

దేశంలోనే అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌. క‌రోనా కాలంలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేక అల్లాడిపోతున్న జ‌నాల‌కు తానున్నానంటూ అభ‌య హ‌స్త‌మిచ్చింది. కానీ తెలుగు బిగ్‌బాస్ మాత్రం ప‌డుతూ లేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. చెప్పినంత సులువుగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ పంచ‌లేక‌పోతోంది. పైగా షోకు ప‌ట్టుకున్న‌ లీకుల తెగులు ప్రేక్ష‌కుడికి ఉన్న కాస్తంత ఆస‌క్తిని కూడా చంపేస్తోంది. అయినా స‌రే షో నిర్వాహ‌కులు వాటిని అరిక‌ట్ట‌లేకపోతున్నారు. ఇక నాల్గో సీజ‌న్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగార్జున ఇటు బిగ్‌బాస్‌తో పాటు వైల్డ్ డాగ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్ర‌స్తుతం మ‌నాలీలో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. దీంతో మ‌రోసారి నెట్టింట గుసగుస‌లు వినిపిస్తున్నాయి. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ కోసం నాగ్‌కు చార్టెడ్ ఫ్లైట్‌)

ఈసారి నాగార్జున స్థానంలో ఏకంగా ఆయ‌న కోడ‌లు, హీరోయిన్ స‌మంత హోస్ట్‌గా రానుంద‌ని ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. మామ మాట‌ను కాద‌న‌లేక ఆమె ఈ ఒక్క‌సారికి ఒప్పేసుకుంటున్న‌ట్లు క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. పైగా దీనివ‌ల్ల షోకు అద‌న‌పు హంగు కూడా వ‌స్తుంద‌ని బిగ్‌బాస్ నిర్వాహ‌కులు భావిస్తున్నార‌ట‌‌. కానీ ఇది నిజం కాక‌పోవచ్చు. ఎందుకంటే అటు సినిమాను, ఇటు బిగ్‌బాస్‌ను బ్యాలెన్స్ చేయ‌డానికి నాగ్ ఇప్ప‌టికే రెడీ అయ్యారు. గ‌తంలో చెప్పిన‌ట్లుగానే ప్ర‌త్యేక చార్టెడ్ విమానంలో హైద‌రాబాద్‌కు వ‌చ్చి వీకెండ్స్‌ షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు. అయితే ద‌స‌రా ప్ర‌త్యేక‌త‌ను దృష్టిలో పెట్టుకొని నిజంగానే స‌మంత‌ను షోకు తీసుకువ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. (చ‌ద‌వండి: జోక‌ర్ ఎలిమినేటెడ్‌, కానీ ఆ కోరిక నెర‌వేర‌నుంది)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top