బిగ్‌బాస్‌: ఇలా అయితే క‌ష్టం లాస్య‌..

Bigg Boss 4 Telugu: Netizens Says Lasya Performing Worst In Tasks - Sakshi

ఏ టాస్కులూ ఆడ‌టం లేద‌ని అంద‌రూ అభి మీద ప‌డ‌తారు. కానీ టాస్కులు ఆడీఆడ‌న‌ట్లుగా క‌నిపించే మ‌రో కంటెస్టెంటు కూడా హౌస్‌లో ఉన్నారు. ఆవిడెవ‌రో కాదు యాంక‌ర్ లాస్య‌. అంద‌రూ అటు గేమ్ ఆడుతూ, ఇటు ఎంట‌ర్‌టైన్ చేస్తూ అభిమానులను పెంచుకుంటూ పోతున్నారు. కానీ లాస్య మాత్రం అటు ఈ రెండింటితో కాకుండా గ‌తంలోని పాపులారిటీతోనే నెట్టుకొస్తున్నారు. వంటింటి కుందేలులాగా ఎప్పుడూ కిచెన్‌లోనే క‌నిపించ‌డం, లేదంటే గాసిప్స్ మాట్లాడుకోవ‌డానికే ఆమె ప‌రిమిత‌మైపోయింది అయితే టాస్కుల్లో చురుకైన ప్ర‌ద‌ర్శ‌న లేక‌పోవ‌డంతో ఆమెకు నెగెటివ్‌గా మారుతోంది. పైగా నిన్న‌టి నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో అరియానా త‌న‌కు కాంపిటీష‌నే కాద‌ని లాస్య‌ చెప్ప‌డాన్ని కూడా నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. టాస్కుల్లో పోటాపోటీగా ఆడే అరియానాకు ఆమెకు పోలికే లేదంటున్నారు. అరియానా ద‌గ్గ‌ర ఫేక్ న‌వ్వు ఉండ‌ద‌ని, ముక్కుసూటిగా మాట్లాడుతుంద‌ని అరియానాకే ఎక్కువ‌మంది స‌పోర్ట్ చేస్తున్నారు. (చ‌ద‌వండి: నా భ‌ర్త నాకంటే ఓ ఏడాది చిన్న‌: లాస్య‌)

అయినా స‌రే లాస్య త‌న బ‌ద్ధ‌కాన్ని వీడిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. నేడు బిగ్‌బాస్ హౌస్ కమాండ్ కంట్రోల్‌గా మారుతున్న విష‌యం తెలిసిందే క‌దా. ఇందులో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల‌కు క‌ఠిన‌మైన ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆయ‌న చెప్పేవ‌న్నీ చేయ‌లేక వాళ్లు తెగ‌ ఆయాస‌ప‌డుతున్నారు. అస‌లీ గేమ్‌లో విజ‌యం సాధిస్తామా? అని హారిక‌కు డౌట‌చ్చింది. అయితే దాన్ని తేలిక‌గా తీసుకున్న లాస్య‌.. ముందు బ‌జ‌ర్ కొడ‌దాం, త‌ర్వాత టాస్కు గురించి ఆలోచిద్దాం.. అని చెప్పుకొచ్చింది. ఇక గేమ్‌లో కూడా అంద‌రూ నేల‌పై పాకుతూ ముందుకెళ్లాల్సి ఉండ‌గా లాస్య మాత్రం చివ‌ర్లో ఎక్క‌డో ఉంది. దీంతో ఆమె టాస్క్ పేప‌ర్ చ‌దివి వినిపిస్తుంది కానీ ఆడ‌ద‌ని కొంద‌రు నెటిజ‌న్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇలానే ఏమీ చేయ‌కుండా ఉంటే ఎలిమినేట్ అవ‌డం ఖాయ‌మ‌ని చెప్తున్నారు. మ‌రోవైపు అరియానా, అవినాష్ మ‌ధ్య గొడ‌వ రాజుకున్న‌ట్లు ప్రోమోలో చూపించారు. మ‌రి అది ఎంత వ‌ర‌కు వెళ్లింద‌నేది చూడాలి.. (చ‌ద‌వండి: తొక్క‌లో రిలేష‌న్స్‌, అంతా న‌టిస్తారు: అఖిల్‌)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top