అర్ధ‌రాత్రి సూట్‌కేసులు స‌ర్దుకున్న‌ కంటెస్టెంట్లు

Bigg Boss 4 Telugu: Abhijeet Ugly Fight With Harika For Hugs - Sakshi

ఈ వారం నో కెప్టెన్‌

త‌న‌కు ఎవ‌రూ లేర‌ని ఫీలైన అఖిల్‌

త‌న‌కు హ‌గ్గులివ్వ‌డం లేద‌ని హ‌ర్టైన అభిజిత్‌

కండ‌బ‌లం ఉంది కానీ బుద్ధి బ‌లం లేద‌ని నిరూపించుకున్నారు అఖిల్‌, మెహ‌బూబ్‌. కెప్టెన్సీ నాకు త‌ప్ప నా ఫ్రెండుకు కూడా ద‌క్క‌కూడ‌ద‌న్న మూర్ఖ‌త్వంతో ప్ర‌వ‌ర్తించి టాస్కు ర‌ద్ద‌య్యేందుకు కార‌ణ‌మ‌య్యారు. ఫ‌లితంగా హౌస్‌లో ఉండేందుకు అవ‌స‌ర‌మైన ప్రాణ‌వాయువులాంటి ఇమ్యూనిటీ ఎవ‌రికీ అంద‌కుండా పోయింది. వీళ్ల గొడ‌వ‌ను చూసి అగ్లీ అన్న‌ అభిజిత్.. హారిక‌తో అంత‌క‌న్నా అగ్లీ గొడ‌వ‌కు దిగాడు. త‌న‌ను ప‌క్క‌న‌పెట్టి అఖిల్‌కే హ‌గ్గులిస్తుంద‌ని నొచ్చుకున్నాడు. వెళ్లి వాళ్ల‌కే నీ హ‌గ్గులు ఇచ్చుకో అని ప‌దే ప‌దే అంటూ జ‌నాల‌కు విసుగు తెప్పించాడు. మ‌రి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఏమేం జ‌రిగాయో తెలియాలంటే దీన్ని చ‌దివేయండి..

గేమ్‌లో ఒంట‌రైన మోనాల్‌
బిగ్‌బాస్ ఈ వారం బాస్కెట్ బాల్స్‌ను గోల్ చేసే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఎవ‌రి బంతిని వాళ్లే కాకుండా మిగ‌తావాళ్లు గోల్ చేయాల్సి ఉంటుంది. బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు ఆల‌స్యంగా గోల్ చేసిన బంతి మీద ఎవ‌రి ముఖం ఉంటే వాళ్లు అవుట్ అవుతారు. ఆఖ‌రి రౌండ్‌లో గోల్ చేసిన బంతి మీద ఎవ‌రి ముఖం ఉంటే వాళ్లే గెలిచిన‌ట్లు. ఈ గేమ్‌లో అభిజిత్ మైండ్ గేమ్ ఆడాడు. అత‌డు, హారిక క‌లిసి త‌న‌కు గిట్ట‌ని వ్య‌క్తి ముఖం ఉన్న బంతిని తీసుకుని కావాల‌ని ఆల‌స్యంగా వేశారు. మోనాల్ బంతిని ఎవ‌రూ తీసుకోలేదు. ఈ గేమ్‌లో చివ‌రికి మెహ‌బూబ్‌, అఖిల్ ఇద్ద‌రే మిగిలారు. (అభిజిత్‌కు హౌస్‌లో ఉండే అర్హ‌త లేదు: అమ్మ రాజ‌శేఖ‌ర్ )

తొక్క‌లో రిలేష‌న్స్‌, అంతా న‌టిస్తారు: అఖిల్‌
ఈసారి నాకు స‌పోర్ట్ కావాలంటే నాకు స‌పోర్ట్ కావాలని ఇద్ద‌రూ వాదులాడుకున్నారు. బ‌జ‌ర్ మోగిన విష‌యం మ‌ర్చిపోయి బాల్ వేయ‌కుండా కీచులాడుతూనే ఉన్నారు. చివ‌రికి నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడుస్తూ ఎవ‌రి బంతి వారు గోల్ చేసేందుకు సిద్ధ‌ప‌డ్డారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన బిగ్‌బాస్ ఇద్ద‌రి బాధ్య‌తారాహిత్యం కార‌ణంగా టాస్క్ మొత్తాన్ని ర‌ద్దు చేస్తున‌ట్లు వెల్ల‌డించారు. ఈ వారానికి హౌస్‌లో కెప్టెనే ఉండ‌ర‌ని ప్ర‌క‌టించాడు. దీంతో స్నేహితుల కోసం గేమ్ నుంచి త‌ప్పుకున్న‌ సోహైల్ చిందులు తొక్కాడు. అన‌వ‌స‌రంగా ఇమ్యూనిటీ రాకుండా చేసుకున్నార‌ని బాధ‌ప‌డ్డాడు. ఇంట్లో నాకు ఒక్క‌డు స‌పోర్ట్ చేయ‌లేదు. ఈ ఒక్క‌సారి చేయుమ‌న్నా.. అని అఖిల్ ఫ్ర‌స్టేట్ అయ్యాడు. అందుకే ఈ తొక్క‌లో రిలేష‌న్స్ వ‌ద్దంటా, అంతా న‌టిస్తారు అని అలిగాడు. ప‌నిలో ప‌నిగా మోనాల్ మీద విసుగు ప్ర‌ద‌ర్శించాడు. ప్ర‌తిసారి నీ కోసం ఆడ‌తా అని ఎందుకనుకుంటున్నావు అని మోనాల్ ముఖం ప‌ట్టుకుని అడ‌గ్గా నా‌కోసం ఆడ‌మ‌ని నీకు చెప్ప‌లేద‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. మ‌రోవైపు త‌న నెత్తి మీద ద‌రిద్రం డ్యాన్స్ చేస్తోంద‌ని మెహ‌బూబ్ క‌న్నీళ్లు పెట్టుకోగా మోనాల్, సోహైల్ ఓదార్చారు.

నేను హ‌గ్గిస్తే కుర్చీలో నుంచి ప‌డిపోతావు..
కెప్టెన్సీ చేజారిన బాధ‌లో నుంచి బ‌య‌ట‌కు రాని అఖిల్.. మెహ‌బూబ్‌, సోహైల్‌తో మాట్లాడుతూ మీరిద్ద‌రే ఫ్రెండ్స్, నేనే అప్పుడ‌ప్పుడు మ‌ధ్య‌లోకి వ‌స్తా. ఈ రిలేష‌న్స్‌, ఫ్రెండ్‌షిప్స్ బక్వాస్‌. అందుకే దివాళీ గిఫ్ట్‌కు మీ ఇద్ద‌రితో పాటు మోనాల్ పేరు కూడా రాయ‌లేదు అని అస‌లు విష‌యం చెప్పాడు. వీళ్ల పంచాయితీ మీద‌ అభిజిత్ సెటైర్లు వేశాడు. ఎందుకింత అగ్లీగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు, మంచిగా ఆడొచ్చు క‌దా అని త‌న టీమ్‌తో చ‌ర్చించాడు. కానీ మ‌రుక్ష‌ణ‌మే అత‌డు అగ్లీ టాపిక్‌కు తెర తీశాడు. పోయి(అఖిల్‌కు) హ‌గ్గులిచ్చుకో పో అని హారిక మీద కోప్ప‌డ్డాడు. నాకు హ‌గ్గిచ్చి ఎన్ని రోజులైతుందో తెలుసా? అని అభి అలగ‌డంతో ఈరోజు పొద్దున్నే క‌దా ఇచ్చాన‌ని హారిక జ‌వాబిచ్చింది. అయినా ఇప్పటికిప్పుడు నేను హ‌గ్గిస్తే కుర్చీలో నుంచి కింద ప‌డిపోతావు అని హెచ్చ‌రించింది. ఎప్పుడూ ఏదో అని, దాన్ని క‌వ‌ర్ చేసేందుకు హ‌గ్గిచ్చావే కానీ సొంతంగా హ‌గ్గిచ్చావా అని నిల‌దీశాడు. అలా కాసేప‌టి వ‌ర‌కు ఈ హ‌గ్గుల గురించి హ‌ద్దులు దాటి మాట్లాడుకున్నారు. (మ‌న‌సు గెలిచేసిన మోనాల్‌)

సూట్‌కేసులు స‌ర్దుకున్న కంటెస్టెంట్లు
మ‌రోవైపు అల‌క బూనిన‌ ఇద్ద‌రు ఫ్రెండ్స్ మ‌ధ్య సోహైల్ న‌లిగిపోయాడు. రేపు ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్పుడు నేను, అఖిల్ ఉంటే.. నువ్వు క‌చ్చితంగా అఖిల్‌నే సేఫ్ చేస్తావు అని మోనాల్‌తో అన్నాడు. దానికి ఆమె స్పందిస్తూ కానీ నేను, నువ్వు ఉంటే మాత్రం అఖిల్ నిన్నే సేఫ్ చేస్తాడ‌ని క్లారిటీ ఇచ్చింది. ఎటొచ్చీ ఈరోజు మోనాల్ మ‌ళ్లీ ఒంట‌రిగా మార‌గా అప్ప‌టివ‌ర‌కూ గొడ‌వ‌ప‌డ్డ సోహైల్‌, అఖిల్‌, మెహ‌బూబ్‌ మ‌ళ్లీ ఒక్క‌టైపోయారు. ఇక అరియానా ద‌గ్గ‌ర మోనాల్ సేఫ్ గేమ్‌ ఆడుతుంద‌ని చెప్పిన అవినాష్‌.. త‌ర్వాత మాత్రం ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి టాప్ 5లో ఉంటావంటూ క్రీమ్ బిస్కెట్లు వేశాడు. అనంతరం అర్ధ‌రాత్రి ఇంటిస‌భ్యుల‌ను నిద్ర లేపిన బిగ్‌బాస్ వారి సూట్‌కేసుల‌ను స‌ర్దుకోమ‌న్నాడు. ఫినాలేకు వెళ్ల‌డానికి ఎవ‌రు అడ్డుప‌డుతార‌నుకుంటున్నారో వారి పేర్ల‌ను చెప్ప‌మ‌న్నాడు. ఎవ‌రు ఎవ‌రి పేర్ల‌ను చెప్ప‌నున్నారో రేప‌టి ఎపిసోడ్‌లో తేల‌నుంది. (అభికి జీరో టాలెంట్‌, అఖిల్‌కు అహంకారం)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

22-01-2021
Jan 22, 2021, 14:33 IST
పైన కనిపిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నానా హంగామా చేస్తోంది. తల్లి చంకనెక్కిన ఆ పాలబుగ్గల పసిపిల్లాడు ఎవరనుకుంటున్నారు?...
19-01-2021
Jan 19, 2021, 14:45 IST
ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది.. అని అఖిల్‌, సోహైల్‌ ఏనాడో అనుకున్నారు. అందుకే వీళ్లిద్దరిలో ఎవరు బిగ్‌బాస్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నా మిగిలినవాడికి బైక్‌,...
11-01-2021
Jan 11, 2021, 20:25 IST
'నువ్వు గెలిస్తే నాకు ల్యాప్‌టాప్‌, బైక్‌ కొనివ్వాలి, నేను గెలిస్తే నీక్కూడా ఆ రెండు కొనిపెడతా' ఇది ఎక్కడో విన్నట్లుంది...
09-01-2021
Jan 09, 2021, 10:30 IST
అప్పటిదాకా చిన్న చిన్న పాత్రల్లో నటించిన సయ్యద్‌ సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్‌-4 సీజన్‌తో ఒక్కసారిగా ఎనలేని గుర్తింపు వచ్చింది. ‘కథ...
29-12-2020
Dec 29, 2020, 00:00 IST
ఇద్దరమ్మాయిలు.. అలేఖ్య హారిక, అరియానా గ్లోరి. ఇద్దరూ బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. అందరి దృష్టిని తమ వైపు నిలుపుకున్నారు. ఇద్దరూ జీవితంలోని...
28-12-2020
Dec 28, 2020, 08:50 IST
బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ విజేతగా మిస్టర్‌ కూల్‌ అభిజిత్‌ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. ఎలాంటి పరిస్థితినైనా డీల్‌ చేయగలిగే నైపుణ్యం, హుందాగా...
27-12-2020
Dec 27, 2020, 11:06 IST
బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్ల క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. సాధారణ వ్యక్తులుగా ఇంట్లోకి...
27-12-2020
Dec 27, 2020, 08:54 IST
హుస్నాబాద్‌: బుల్లితెర వీక్షకులను అలరించిన తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ సోహైల్‌కు శనివారం రాత్రి హుస్నాబాద్‌ పట్టణంలో అభిమానులు ఘన...
26-12-2020
Dec 26, 2020, 13:25 IST
మోనాల్‌ గజ్జర్‌.. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన పేరు ఇది. తొలుత అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ...
23-12-2020
Dec 23, 2020, 16:11 IST
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లను చూసి జనాలు పెదవి విరిచారు. ముక్కూమొహం తెలీని వాళ్లను హౌస్‌లోకి పంపించారేంటని విమర్శలు గుప్పించారు....
23-12-2020
Dec 23, 2020, 10:39 IST
బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ఆటలు, పాటలు, అలకలు, గొడవలు, కోపాలు, బుజ్జగింపులు, ప్రేమ, గాసిప్స్‌...
23-12-2020
Dec 23, 2020, 04:59 IST
బిగ్‌ స్క్రీన్‌లో నటించాలి. బిగ్‌ హౌస్‌లో జీవించాలి. రెండూ తెలిసిన కుర్రాడు అభిజీత్‌. సహజంగానే స్ట్రాంగ్‌. ‘రియాలిటీ’తో.. మరింత స్ట్రాంగ్‌ అయ్యాడు. విజేతగా నిలిచాడు. ‘ఈ...
22-12-2020
Dec 22, 2020, 15:56 IST
అభి-హారికల మధ్య కూడా ఏదో నడుస్తుందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.
22-12-2020
Dec 22, 2020, 14:28 IST
బుల్లితెర ప్రేక్షకులను 106 రోజులపాటు అలరించిన బిగ్‌ రియాల్టీ రియాలిటీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌కు శుభం కార్డు పడింది....
22-12-2020
Dec 22, 2020, 13:39 IST
తెలుగు బుల్లితెరపై 106 రోజులు వినోదాన్ని అందించిన బిగ్‌బాస్‌ సీజన్‌ 4 డిసెంబర్‌ 20న శుభంకార్డు పడిన విషయం తెలిసిందే....
22-12-2020
Dec 22, 2020, 04:24 IST
క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌తో ఉద్యోగంలో చేరి ఉంటే అభిజీత్‌ అనే ఒక నటుడు తెలుగు తెరకు పరిచయమయ్యే వాడే కాదేమో!
21-12-2020
Dec 21, 2020, 11:08 IST
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4 కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సేపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ నడుస్తోంది. హౌజ్‌లోనూ, బయట కూడా అతను...
21-12-2020
Dec 21, 2020, 09:16 IST
చిరంజీవి ఎదుట తన మనసులో మాటను సోహైల్‌ బయటపెట్టాడు.
21-12-2020
Dec 21, 2020, 08:32 IST
జీవితంలో మరోసారి బిగ్‌బాస్‌ చూసేది లేదని, కంటెస్టెంట్లకు ఓట్లు వేయమని తెగేసి చెప్తున్నారు.
21-12-2020
Dec 21, 2020, 01:32 IST
సాక్షి, హైదరాబాద్‌: బుల్లితెర వీక్షకులను 106 రోజులపాటు అలరించిన ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌–4 గ్రాండ్‌ ఫినాలే ఆదివారం ముగిసింది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top