బిగ్‌బాస్‌: అవినాష్‌కు గడ్డు కాలం?

Bigg Boss 4 Telugu: Mukku Avinash In Danger Zone For 13 Week - Sakshi

ఏ దారి తెలీని నావ‌లా ఎటో వెళ్లిపోతున్న బిగ్‌బాస్ హౌస్‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప‌రిచ‌యం చేశాడు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ముక్కు అవినాష్‌. లేటుగా వ‌చ్చినా లేటెస్ట్‌గా వ‌చ్చి అంద‌రితో క‌లిసిపోయాడు. త‌న కామెడీతో అంద‌ర్నీ డామినేట్ చేశాడు కూడా. దీంతో మొద‌ట్లో అత‌నికి వంక పెట్ట‌డానికి ఏమీ లేకపోవ‌డంతో ఎవ‌రూ అత‌డిని నామినేట్ చేయ‌లేదు. కానీ రానురానూ కంటెస్టెంట్లు త‌గ్గేకొద్దీ, ఆట‌తీరు, మాట‌తీరు, ప‌ని తీరు ఇలా అన్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కొంద‌రు అవినాష్‌ను కూడా నామినేట్ చేయ‌డం మొద‌లు పెట్టారు. అప్ప‌టి నుంచి అత‌డిలో మార్పు మొద‌లైంది. ఎప్పుడూ న‌వ్వుతూ న‌వ్విస్తూ ఉండే అవినాష్ నామినేష‌న్ అంటే చాలు భ‌గ్గుమ‌ని లేచేవాడు. ఆవేశంతో ఊగిపోయేవాడు. ఎలిమినేట్ అయిపోతానేమోన‌ని తెగ భ‌య‌ప‌డిపోయేవాడు. అత‌డిని నామినేట్ చేసిన ప్ర‌తిసారి ఇదే జ‌రిగేది.

త‌గ్గుతూ వ‌స్తోన్న అవినాష్ గ్రాఫ్‌
దీనికి తోడు నోయ‌ల్ ఎలిమినేష‌న్ త‌ర్వాత అత‌డు మ‌రింత డ‌ల్ అయ్యాడు. కామెడీ చేయ‌డం త‌గ్గించేశాడు. బిగ్‌బాస్ కోసం త‌న జీవనాధార‌మైన‌ జ‌బ‌ర్ద‌స్త్‌ను వ‌దిలేసి వ‌చ్చాను అంటూ సింప‌థీ కోసం పాకులాడిన‌ట్లు క‌నిపించింది. కానీ జ‌బ‌ర్ద‌స్త్‌లో త‌న అన్న‌కు మ‌ళ్లీ అవ‌కాశం ఉంద‌ని అవినాష్ సోద‌రులే బాహాటంగా చెప్ప‌డంతో అత‌ని మీద వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. ఇక అప్ప‌టి నుంచి అవినాష్ గ్రాఫ్ త‌గ్గుతూ రాగా దాని ఎఫెక్ట్ ప‌న్నెండో వారంలో స్ప‌ష్టంగా క‌న‌ప‌డింది. అఖిల్‌, మోనాల్, అరియానా నామినేష‌న్‌లో ఉన్న‌ప్ప‌టికీ వారిక‌న్నా అవినాష్‌కే త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి. అయితే త‌ను సంపాదించుకున్న ఫ్రీ ఎవిక్ష‌న్ పాస్‌తో ఎలిమినేష‌న్ నుంచి ఈజీగా త‌ప్పించుకున్నాడు. (చ‌ద‌వండి: హారిక‌ను పెళ్లి చేసుకుంటా: అవినాష్‌)

ఈ వారం డేంజ‌ర్ జోన్‌లో ఆ ఇద్ద‌రూ
కానీ దురదృష్టం కొద్దీ ఈ వారం కూడా అవినాష్ నామినేష‌న్‌లో ఉన్నాడ‌ని లీకువీరులు చెప్తున్నారు. అదే క‌న‌ నిజ‌మైతే ఈసారి అత‌డు డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్లే. తాజాగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న లిస్టు ప్ర‌కారం ఈ వారం అఖిల్‌, అభిజిత్‌, హారిక‌, అవినాష్‌, మోనాల్ నామినేష‌న్‌లో ఉన్నారు. వీరిలో అఖిల్‌, అభిజిత్ ఎలాగో ముందుగానే సేవ్ అవుతారు. మ‌రోవైపు త‌న కెప్టెన్సీలో చేసిన త‌ప్పుల‌ను ప్రేక్ష‌కులు క్ష‌మించేస్తే హారిక కూడా సేవ్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగానే క‌నిపిస్తున్నాయి. ఇక ఎన్నోవారాలుగా నామినేష‌న్‌లో ఉంటూ వ‌స్తోన్న మోనాల్‌ను బిగ్‌బాస్ వదులుకోడ‌న్న‌ది నెటిజ‌న్ల అభిప్రాయం. మిగిలింద‌ల్లా అవినాష్! ఒక‌వేళ అరియానా అభిమానులు కూడా సపోర్ట్ చేస్తే ఈ వారం కూడా అత‌డు ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించుకునేందుకు ఆస్కారం లేక‌పోలేదు. మొత్తానికి ఈ వారం అవినాష్‌, మోనాల్ డేంజ‌ర్ జోన్‌లో ఉండే అవ‌కాశం ఉంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : అవినాష్‌కి ఏమైంది..ఎందుకలా చేశాడు?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top