బిగ్‌బాస్‌: ప‌రువు ‌తీసుకున్న అవినాష్‌

Bigg Boss 4 Telugu: Monal Gajjar Calls Avinash As Brother - Sakshi

నిన్న ముద్దిచ్చి, ఇప్పుడు అన్న‌య్యా అనేసింది 

బిగ్‌బాస్ షో ముగింపుకు వ‌స్తున్నా మోనాల్ వ్య‌వ‌హారం మాత్రం ఎవరికీ ఓ ప‌ట్టాన అర్థం కావ‌డం లేదు. మొద‌ట అభిజిత్‌తో, త‌ర్వాత అఖిల్‌తో క్లోజ్‌గా ఉంటూ వ‌స్తున్న మోనాల్ మొన్న‌టి నామినేష‌న్‌లో ఆ ఇద్ద‌రిని తొలిసారి నామినేట్ చేసి షాకిచ్చింది. ఇకపై నా గేమ్ నేను ఆడ‌తా, నేను ఫ్యామిలీ కోసం ఆడ‌తా అంటూ త‌న‌లో తానే మాట్లాడుకుంది. అంద‌రూ టార్గెట్ చేసినా వారిని ఎదిరించి పోరాడింది. అయితే రేస్ టు ఫినాలే టాస్క్‌లో మోనాల్ త‌న‌ను త‌న్నింద‌ని అవినాష్ తెగ ఫీల‌య్యాడు. ప‌దేప‌దే ఆమె త‌న్నిందంటూ దాని గురించే మాట్లాడ‌టం మొద‌లు పెట్టాడు. దీంతో మోనాల్.. నిజంగా నేను త‌న్నానో లేదో క్లారిటీ లేదంటూనే అత‌డికి సారీ చెప్పింది. కాలితో త‌న్నినందుకు కాళ్లు ప‌ట్టుకోబోయింది. దీంతో షాక్ తిన్న అవినాష్ మామూలుగా సారీ చెప్తే స‌రిపోతుంద‌న్నాడు. అయితే ఆమె మాత్రం సారీ చెప్పి, హ‌గ్గిచ్చి బుగ్గ‌న ముద్దు పెట్టి అత‌డిని కూల్ చేసింది. (చ‌ద‌వండి: అరియానా ఎందుకంత‌ సీన్ క్రియేట్ చేస్తుంది?: అవినాష్‌)

దీంతో అవినాష్ గాల్లో తేలిపోయి ఉండొచ్చు. కానీ ఇది జ‌రిగిన తెల్లారే అవినాష్‌ను అన్న‌య్య అని పిలుస్తూ అత‌డి గాలి తీసేసింది. తాజాగా రిలీజైన ప్రోమోలో రేస్ టు ఫినాలే మూడో లెవ‌ల్ మొద‌లైంది. ఇందులో ఇద్ద‌రు పోటీదారులు సోహైల్‌, అఖిల్ ఉయ్యాల‌లో కూర్చున్నారు. వీరికి బిగ్‌బాస్ జ్యూసుల మీద జ్యూసులు పంపుతున్నాడు. వాటిని తాగ‌లేక క‌క్క‌లేక ఆ ఇద్ద‌రు స్నేహితులు నానా అవ‌స్థ‌‌లు ప‌డుతున్నారు. మ‌రోవైపు మోనాల్‌, అవినాష్ క‌లిసి రావ‌డం చూసిన‌ అఖిల్.. మోనాల్‌, అతడు మీ త‌మ్ముడా? అని అడిగాడు. దీంతో అఖిల్‌కు కౌంట‌రివ్వాల‌ని భావించిన అవినాష్.. నేను నీకు అన్న‌నా? అవినాషా? అని మోనాల్‌ను అడిగాడు. ఈ ప్ర‌శ్న‌కు మోనాల్ ఏమాత్రం త‌డుముకోకుండా అవినాష్ అన్న అన‌డంతో అత‌డి ప‌రువు పోయిన‌ట్లు ఫీల‌య్యాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌లో ప‌నికి రానోళ్ల‌ను తోసేయండి: రాహుల్)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top