బిగ్‌బాస్‌: అభికి షాకుల మీద షాకులు

Bigg Boss 4 Telugu: Monal And Abhijeet Nominates Each Other - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో అంద‌రిలో ఆస‌క్తి రేకెత్తించిన ట్ర‌యాంగిల్ స్టోరీ ఎన్నో మ‌లుపులు తిరుగుతూ ఉంది. మోనాల్ కోసం కొట్టుకు చచ్చిన అఖిల్‌, అభిజిత్ ఇప్పుడు ఆమెనే పెద్ద స‌మ‌స్య‌గా భావిస్తున్నారు. నిన్న‌టికి నిన్న నీకే గ‌న‌క శ‌క్తినిస్తే ఎవ‌రిని మాయం చేస్తావు అని అఖిల్‌ను అడిగితే అత‌ను క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా ట‌పీమ‌ని మోనాల్ పేరు చెప్పాడు. ఆమె త‌న గేమ్‌కు డిస్ట‌బెన్స్‌గా మారింద‌ని తెలిపాడు. మ‌రోవైపు అభిజిత్‌.. మోనాల్‌తో డేట్‌కు వెళ్లే టాస్క్‌ను చేయ‌న‌ని మొండికేసినందుకు నాగ్‌తో చీవాట్లు తిన్నాడు. బిగ్‌బాస్ ఇచ్చే ఏ టాస్క్ అయినా చేయాల్సిందేన‌ని మొట్టికాయ‌లు వేయించుకున్నాడు. అత‌డి చేత టాస్క్ చేయించాల్సిన బాధ్య‌త కెప్టెన్‌ది కాదా? అని నాగ్‌ హారిక‌ను కూడా గ‌ట్టిగానే వేసుకున్నారు. దీని ఎఫెక్ట్ అంతా నేటి ఎపిసోడ్‌లో స్ప‌ష్టంగా క‌నిపించ‌నున్న‌ట్లు ప్రోమో చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. (చ‌ద‌వండి: మోనాల్‌తో లింక్ చేయ‌కండి: అభి వేడుకోలు)

ఇప్ప‌టికే హారిక అభిని నామినేట్ చేసి షాకిచ్చింది. అందులో నుంచి తేరుకోక‌ముందే అభికి మ‌రో షాక్ త‌గిలింది. మోనాల్ తొలిసారి అభిని నామినేట్ చేసింది. అభి కూడా మోనాల్‌ను నామినేట్ చేస్తూ 'ఈ షో మొద‌టి రోజు నుంచే నీవ‌ల్ల ఎమోష‌న‌ల్‌గా హ‌ర్ట్ అవుతున్నాను. నీకు ద‌గ్గ‌ర‌గా ఉన్నా, దూరంగా ఉన్నా నేను ఇబ్బందిప‌డుతూనే ఉన్నా'న‌ని చెప్తూ మ‌న‌సులోని భారాన్ని దింపే ప్ర‌య‌త్నం చేశాడు. విడ్డూరంగా మోనాల్ నేడు అఖిల్‌, అభి ఇద్ద‌రినీ నామినేట్ చేసింది. ఏదేమైనా నామినేష‌న్ ప్ర‌క్రియ‌తో జంట‌ల‌ను విడ‌గొట్టాల‌నుకున్న బిగ్‌బాస్ ప‌థ‌కం విజ‌య‌వంత‌మైన‌ట్లే తెలుస్తోంది. ఎన్నో ట్విస్టులు, మ‌రెన్నో వింత‌లు చోటు చేసుకుంటున్న నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తిగా చూడాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: మ‌ధ్య‌లో మాట్లాడ‌కు: అవినాష్‌కు మోనాల్ వార్నింగ్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top