బిగ్‌బాస్‌: హారిక అవుట్! కానీ.. | Bigg Boss 4 Telugu: Harika Will Eliminated But She Went To Secret Room | Sakshi
Sakshi News home page

ఫేక్ ఎలిమినేష‌న్;‌ సీక్రెట్ రూమ్‌లోకి హారిక‌

Sep 20 2020 3:31 PM | Updated on Sep 20 2020 7:56 PM

Bigg Boss 4 Telugu: Harika Will Eliminated But She Went To Secret Room - Sakshi

కాబ‌ట్టి నేడు మ‌రో కంటెస్టెంట్‌ను హౌస్ నుంచి వెళ్ల‌గొట్ట‌నున్నారు. అయితే ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్‌లో రెండో ఎలిమినేష‌న్ జ‌రిగిపోయింది. వ‌చ్చీరాగానే ఎదుటివాళ్ల‌ను మాట్లాడ‌నీయ‌కుండా, త‌న‌మాటే క‌రెక్ట్ అంటూ చీటికిమాటికీ గొడ‌వ‌లు ప‌డి అప్ర‌తిష్ట మూట గ‌ట్టుకున్న క‌‌రాటే క‌ల్యాణిని బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు పంపించేశారు. ఇక్క‌డితో ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ ముగిసిపోలేదు. డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉందంటూ నాగ్ ట్విస్ట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. కాబ‌ట్టి నేడు మ‌రో కంటెస్టెంట్‌ను హౌస్ నుంచి వెళ్ల‌గొట్ట‌నున్నారు. అయితే ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నేడు ఫేక్ ఎలిమినేష‌న్ జ‌ర‌గ‌నున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేత్త‌డి హారిక‌ను ఎలిమినేట్‌ చేసి, ఆమెను సీక్రెట్ రూమ్‌లోకి పంపించ‌నున్నార‌ని లీకువీరులు చెప్తున్నారు. మూడో సీజ‌న్‌లో రాహుల్ సిప్లిగంజ్‌ను ఎలిమినేట్ అని చెప్పి, త‌ర్వాత సీక్రెట్ రూమ్‌లోకి పంపించారు. అత‌డి రీఎంట్రీ బాగా హిట్ట‌యింది. మ‌రీ ఈ సీజ‌న్‌లో ఫేక్ ఎలిమినేష‌న్ ఎంత‌మేర‌కు పండుతుందో చూడాలి. (డ‌బుల్ ఎలిమినేష‌న్; క‌ళ్యాణి అవుట్‌)

క‌ల్యాణికే గుబులు ప‌ట్టించిన బిగ్ బాంబ్‌!
ఇదిలా వుంటే నిన్న ఎలిమినేట్ అయిన క‌ల్యాణితో పాటు, అటు ఇంటి స‌భ్యులంద‌రితోనూ నాగ్ గేమ్స్ ఆడించిన‌ట్లు తెలుస్తోంది. త‌ద్వారా గంభీరంగా ఉన్న వాతావర‌ణాన్ని కూల్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇక క‌ల్యాణి.. అవినాష్‌ను అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తిగా పేర్కొంటూ, అత‌డు ఇంట్లో బ‌ల‌వుతాడ‌ని జాలి చూపించింది. దీంతో అవినాష్ 'నాక‌న్నా ముందు నువ్వే బ‌ల‌య్యావుగా అక్కా' అంటూ ఉన్న‌మాట బ‌య‌ట‌పెట్టాడు. దేవి నాగ‌వ‌ల్లిని త‌క్కువ అంచనా వేయ‌కండ‌ని ఆమె సూచించింది. త‌ర్వాత నాగ్.. క‌ల్యాణికి కూడా కంగారు పుట్టించే బిగ్‌బాంబ్‌ను ఆమెతో వేయించారు. అదేంటో తెలియాల‌టే మ‌రికొన్ని గంట‌లు వేచి చూడాలి. (హౌస్‌లో మంట పెట్టిన‌ శ్రుతి మించిన కామెడీ)

Advertisement
 
Advertisement
Advertisement